టీడీపీకి ఎన్టీఆర్ దూరం అవ్వడానికి కారణం వారే ?  

Bonda Uma Sensational Coments About Jr Ntr-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వయోభారంతో ఉండడంతో రానున్న రోజుల్లో టీడీపీని సమర్ధవంతంగా ముందుకు నడిపించే నాయకుడు కోసం ఎదురుచూస్తోంది.లోకేష్ బాబు వారసుడిగా ఉన్నా ఆ పార్టీ నేతలకు కూడా ఆయన మీద పెద్దగా నమ్మకాలు లేవు.ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర మీదకు వచ్చింది.ఆయనొక్కడే సమర్ధవంతంగా పార్టీని ముందుకు నడిపించగలదంటూ కొన్ని సూచనలు, ప్రతిపాదనలు అందాయి.

Bonda Uma Sensational Coments About Jr Ntr- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Bonda Uma Sensational Coments About Jr Ntr--Bonda Uma Sensational Coments About Jr Ntr-

అయితే ఆ తరువాత టిడిపి సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఓ సమావేశంలో మాట్లాడుతూ అసలు తమకు జూనియర్ ఎన్టీఆర్ అవసరమే లేదని, చంద్రబాబు నాయకత్వంలో తాము ముందుకు వెళ్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు.ఇక టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా ఈ రోజు ఓ సమావేశంలో మాట్లాడుతూ అసలు ఎన్టీఆర్ టీడీపీకి దూరం అవడానికి ప్రధాన కారణం కొడాలి నాని, వల్లభనేని వంశీ లే అంటూ విమర్శలు చేశారు.ఎన్టీఆర్ ను ఈ ఇద్దరు అన్ని విధాలుగా వాడుకుని రాజకీయంగా బలపడిన తరువాత వదిలేశారని బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.వంశీ కి చంద్రబాబు ఎంపీ టికెట్, రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని కానీ ఆ విషయాన్ని ఆయన మర్చిపోయారని, సొంత ప్రయోజనాల కోసమే వంశీ అవినాష్ పార్టీ మారారు అంటూ ఉమా విమర్శలు చేశారు.