కమిషన్ కు నీ వాద‌నెందుకు వినిపించ‌వ్‌....

కాపుల‌కు తానే పెద్ద‌దిక్క‌న‌ని చెప్పుకు ముద్రగడ పద్మనాభం కాపుల అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కమిషన్కు ఎందుకు స‌.హ‌క‌రించ‌డంలేద‌ని తెలుగుదేశం పార్టీ ఎదురుదాడికి తెర‌లేపింది.

 Bonda Uma Maheshwar Rao On Mudragada-TeluguStop.com

ముద్ర‌గ‌డ విప‌క్షానికి రాజ‌కీయ ్ర‌ప‌యోజ‌నాలు చేకూర్చేందుకు చూస్తున్న‌ట్లుంద‌ని తుని ఘటన బాధ్యుల అరెస్టు చేద్ద‌ని దీక్ష‌లు చేయ‌ట‌మేంట‌ని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నిల‌దీసారు.కాపు కమిషన్‌ ఎదుట తన వాదనలు వినిపించే అవ‌కాశాలున్నా, ఉద్దేశ‌పూర్వ‌కంగా ప్ర‌జ‌ల‌ను తప్పుదారి పట్టించేందుకు ఎవరిపై కేసులు పెట్టవద్దు, తనను అరె స్ట్‌ చేయమని చెప్పిన ముద్రగడ, అరెస్టు ద‌గ్గ‌ర‌కొచ్చేస‌రికి అనుచ‌రుల‌తో పోలీసుల‌పై దాడుల‌కు ఉసిగొలిపార‌ని విమ‌ర్శించారు.

మంత్రిగా ఉన్నప్పుడు కాపులు తన వద్దకు రావద్దని బోర్డు పెట్టుకున్న ముద్రగడ ఇప్పుడు కాపుల కోసమంటూ రోడ్ల‌పైకి రావ‌టంలో ఆంత‌ర్య‌మేంటో ప్ర‌జ‌లు ్ర‌గ‌హించార‌ని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు వ్యాఖ్యానించారు.

కాపు ఐక్య గర్జన పేరుతో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి, వైకాపా నేత‌ల సార‌ధ్యంలో విధ్వంసాల‌కు పాల్ప‌డ‌న‌ప్పుడు నిందితుల‌ను అరెస్టు చేస్తే ఎందుకు భీతిల్ల‌తున్నార‌ని ప్ర‌శ్నించారు.

హింసాకాండ రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌ని భ‌యభ్రాంతుల‌కు గురిచేస్తే, దానిపై విచార‌ణ‌లు జ‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉండ‌దా?, అలాంట‌పుడు విధ్వంసం చేసిన వారి అరెస్టులు ఉండవని ప్రభుత్వం ఎందుకు చెప్తుంద‌ని, ఉద్యమాలు జరిగినప్పుడు కేసులు, అరెస్టులు సాధార‌ణంగా జ‌రిగేదే అని చెప్పారు.విధ్వంసం వెనుక నీ మ‌నుషులు లేర‌ని న‌వ్వ‌నుకుంటే… కేసులు, అరెస్టుల‌కెందుకు భ‌యం.

ప్ర‌భుత్వ‌మే విధ్వం సం జ‌రిపింద‌ని చెప్తూ ఉన్న‌ప్పుడు వాటి ఆధారాలు బ‌హిరంగ ప‌ర‌చాల‌ని డిమాండ్ చేసారాయ‌న‌.ఈమ‌ధ్య నేత‌లంద‌రినీ క‌ల‌సిన ముద్ర‌గ‌డ వారి మ‌ద్ద‌తుతో కొత్త త‌ర‌హా వ్య‌వ‌హారాలు చేస్తు, నేర‌స్తుల‌ను కాపాడాల‌ని చూడ‌టం స‌రికాద‌ని అన్నారు బొండా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube