ఓటమి పై హైకోర్టును ఆశ్రయించిన బోండా ఉమా

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తనపై 25 ఓట్ల మెజారిటీ తో వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందడం పై ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

 Bonda Uma Getting Help In High Court1-TeluguStop.com

తమ నియోజకవర్గంలోని 11 పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్స్‌ను లెక్కించాకే ఫలితాల్ని ప్రకటించాలని కోరినా రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోలేదని, ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందే వీవీ ప్యాట్స్ లెక్కింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కి అప్పుడే విన్నవించానని, ఈ క్రమంలో మే 23 న విష్ణు గెలుపు ను డిక్లేర్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలనీ పిటీషన్ లో పేర్కొన్నారు.ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు వ్యత్యాసాల్ని తాను గమనించానని, ఈ అంశాలన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ పిటీషన్ పై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

-Telugu Political News

ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల మేరకు వ్యవహరించేలా ఎన్నికల అధికారిని ఆదేశించాలని ఈ సందర్భంగా ఉమా కోరారు.అయితే ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 18 కి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోండా ఉమా పై వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు విజయాన్ని సాధించారు.అంతేకాకుండా ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 సీట్ల భారీ మెజారిటీ తో గెలిచి ఏపీ లో ప్రభుత్వాన్ని స్థాపించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube