తెలుగులోకి బొమ్మరిల్లు బ్యూటీ రీఎంట్రీ.. అలాంటి కథతో..?

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు జెనీలియా.శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఢీ, రెడీ, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమా జెనీలియాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 Bommarillu Heroine Genelia Reentry In Tollywood Movies, Bommarillu Heroine , Gen-TeluguStop.com

బొమ్మరిల్లు సినిమా విడుదలై చాలా సంవత్సరాలే అయినా ఆ సినిమాలోని హాసిని పాత్రను ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు.సినిమాల్లో అల్లరి చేసే పాత్రల్లో నటించిన ఈ బొమ్మరిల్లు బ్యూటీ పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే జెనీలియా తనకు ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టిన తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నారని త్వరలోనే జెనీలియా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాల్లో నటించిన జెనీలియా ప్రముఖ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్నారు.

Telugu Bommarillu, Genelia, Reentry, Tollywood-Movie

సరైన కథ దొరికితే తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న జెనీలియా రీఎంట్రీలోనూ తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టే కథల కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది.అయితే ఏ హీరో సినిమాతో జెనీలియా తెలుగులోకి ఎంట్రీ ఇస్తారో తెలియాల్సి ఉంది.పలువురు టాలీవుడ్ హీరోయిన్లు రీఎంట్రీలో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.

మెగా హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించిన జెనీలియా రీఎంట్రీలో ఎలాంటి పాత్రల్లో నటిస్తారో చూడాల్సి ఉంది.ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన భూమిక, స్నేహ లాంటి హీరోయిన్లు రీఎంట్రీలో అక్క, వదిన తరహా పాత్రల్లో నటిస్తున్నారు.

జెనీలియా కూడా అలాంటి పాత్రల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకాదరణ పెరుగుతున్న నేపథ్యంలో అలాంటి కథలకు జెనీలియా గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube