వరుస ఫ్లాపుల తర్వాత సక్సెస్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు వీళ్లే?

Bommarillu Bhaskar To Srikanth Addala These 8 Tollywood Directors Comeback With Hits And Flops

సినిమా ఇండస్ట్రీలో హీరోలు అయినా డైరెక్టర్లు అయినా సక్సెస్ లో ఉంటే మాత్రమే వాళ్లకు కొత్త ఆఫర్లు వస్తాయి.వరుసగా సక్సెస్ లు సాధించి ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఆయా హీరోలు, డైరెక్టర్లతో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు భయపడతారు.

 Bommarillu Bhaskar To Srikanth Addala These 8 Tollywood Directors Comeback With Hits And Flops-TeluguStop.com

అయితే కొంతమంది డైరెక్టర్లు మాత్రం వరుస ఫ్లాపుల తర్వాత కూడా విజయాలను సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.ఆరెంజ్, ఒంగోలు గిత్త ఫ్లాపుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ సాధించారు.

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న శ్రీకాంత్ అడ్డాలకు ఆ తరువాత సినిమాల ఫలితాలు షాక్ ఇచ్చాయి.బ్రహ్మోత్సవం సినిమా శ్రీకాంత్ అడ్డాల కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

 Bommarillu Bhaskar To Srikanth Addala These 8 Tollywood Directors Comeback With Hits And Flops-వరుస ఫ్లాపుల తర్వాత సక్సెస్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు వీళ్లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే నారప్ప సినిమాతో శ్రీకాంత్ అడ్డాల భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.అ! సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న ప్రశాంత్ వర్మ జాంబి రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు.

బలుపు సినిమా తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.కేవీ అనుదీప్ దర్శకత్వం వహించిన తొలి సినిమా పిట్టగోడ ఫ్లాప్ కాగా జాతిరత్నాలు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బిజినెస్ మేన్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలు ఫ్లాప్ కాగా టెంపర్ సినిమాతో పూరీ జగన్నాథ్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

రామ్ చరణ్ తో తెరకెక్కించిన రచ్చ సినిమా తర్వాత సరైన హిట్ లేని సంపత్ నంది ఈ ఏడాది సీటీమార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.సక్సెస్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన డైరెక్టర్లలో కొంతమంది డైరెక్టర్లు వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

#Hits Flops #Srikanth Addala #Kv Anudeep #Elegble Bachlor #Directors

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube