బొమ్మరిల్లు భాస్కర్ కు లక్కీ చాన్స్..!

బొమ్మరిల్లు సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఆ తర్వాత తీసిన పరుగు కూడా పర్వాలేదనిపించుకున్నాడు.ఇక రాం చరణ్ తో ఆరెంజ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒంగోలు గిత్త అంటూ తీసినా అవి ఫ్లాప్ అవ్వడంతో ఇక్కడ నుండి కోలీవుడ్ బాట పట్టాడు.

 Bommarillu Bhaskar Got A Lucky Chance In Geetha Arts-TeluguStop.com

మలయాళ సూపర్ హిట్ మూవీ బెంగుళూర్ డేస్ తమిళ్ రీమేక్ బెంగుళూరు నాటకల్ డైరెక్ట్ చేసిన భాస్కర్ అది కూడా ఆశించిన విజయం దక్కించుకోలేకపోవడంతో నిరాశ పడ్డాడు.

ప్రస్తుతం నిర్మాతలకు కథ వినిపిస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడట.

భాస్కర్ చెప్పిన లైన్ నచ్చడంతో అల్లు అరవింద్ పూర్తి స్క్రిప్ట్ తో వచ్చేయమని సినిమా కన్ఫాం అనేశాడట.ఓ విధంగా భాస్కర్ కు ఇదో లక్కీ చాన్స్ అని చెప్పాలి.

ఇక బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తేనే గాని సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరన్నది నిర్ణయించడం కుదరదని అంటున్నారు.సో రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని భాస్కర్ ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube