అఖిల్‌ బ్యాచిలర్‌గా ఏ లుక్‌తో కనిపించబోతున్నాడో తెలిస్తే నోరు వెళ్లబెడతారు

అక్కినేని అఖిల్‌ మూడు సినిమాలు నిరాశ పర్చాయి.అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా అఖిల్‌ తన నాల్గవ సినిమాను చేస్తున్నాడు.

 Bommarillu Bhaskar Akhil Look Bachilar-TeluguStop.com

ఈసారి గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో అఖిల్‌ మూవీ తెరకెక్కుతుంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.

ఈయన చెప్పిన కథను నమ్మిన అల్లు అరవింద్‌ ఖచ్చితంగా ఇది అఖిల్‌కు సూట్‌ అవుతుందని నమ్మి ఈ చిత్రాన్ని చేస్తున్నాడట.అఖిల్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదలకు సిద్దం చేశారు.

ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.బొమ్మరిల్లు సెంటిమెంట్‌ కలిసి వచ్చేలా బి లెటర్‌తోనే సినిమా టైటిల్‌ను పెట్టాడు.బ్యాచిలర్‌ అనే టైటిల్‌ను పెట్టి దానికి అదనంగా మోస్ట్‌ ఎలిజబుల్‌ అనే టాగ్‌ను పెట్టాడు.మొత్తానికి ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతుంది.

తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Telugu Akhil, Akhil Bachilar-

ఇక ఈ చిత్రంలో అక్కినేని అఖిల్‌ లుక్‌పై ఆసక్తికర చర్చ జరుగుతుంది.తాజాగా ఫ్రీ లుక్‌ను విడుదల చేశారు.అందులో ఫార్మల్‌ పాయింట్‌ మరియు ఫార్మల్‌ షూను వేసుకుని చాలా స్టైలిష్‌గా అఖిల్‌ కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది.

బొమ్మరిల్లు సినిమాలో సిద్దార్థ ఎలా అయితే చాలా ఫార్మల్‌గా కనిపించాడో ఇందులో అఖిల్‌ కూడా అలాగే కనిపించబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.బొమ్మరిల్లు సిద్దు తరహా పాత్రలోనే అఖిల్‌ కనిపించబోతున్నాడు.

కనుక బ్యాచిలర్‌ సినిమా సక్సెస్‌ ఖాయం అనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube