శ్రీముఖి నా మొదటి పెళ్ళామన్న సద్దాం.. దాంతో నెటిజన్లు...  

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రతి ఆదివారం రాత్రి ప్రసారమయ్యే “బొమ్మ అదిరింది” షో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా ఈ షో నిర్వాహకులు వచ్చే ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమో ని యూట్యూబ్ లో విడుదల చేశారు.

TeluguStop.com - Bomma Adirindi Comedian Saddam Negative Trolled By Sreemukhi Fans In Social Media

అయితే ఈప్రోమో ని ఒకసారి పరిశీలించినట్లయితే అప్పట్లో పలు టాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సీనియర్ హీరోయిన్ లైలా గెస్ట్ గా వచ్చింది.దీంతో పండు ఆమెని ప్రేమలో పడేసేందుకు కవితలు, డాన్సులు చేస్తూ ప్రోమో మొదలవుతోంది.

 అయితే ప్రోమో చివర్లో సద్దాం ఏకంగా శ్రీముఖి చూపిస్తూ ఈమె నా మొదటి పెళ్ళామని, అంతేగాక ఈశాన్యంలో బరువు ఉండాలని తనతో కొందరు చెప్పారని అందువల్లనే శ్రీముఖి ని పెళ్లి చేసుకున్నట్లు చెబుతూ సరదాగా నవ్వించాడు.

TeluguStop.com - శ్రీముఖి నా మొదటి పెళ్ళామన్న సద్దాం.. దాంతో నెటిజన్లు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నదిని ఎందుకు ఆ పేరుతో పిలుస్తారని అడగగా మొన్న పడిన వానలకి హైదరాబాద్ మొత్తం కొట్టుకుపోయిందని దాంతో మూసీ నదిని మూసే ఉంచాలని అందువల్లనే మూసీ నది అని పిలుస్తారని పంచులు పేల్చాడు.

అయితే ఈ ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేసిన మూడు రోజులలోనే దాదాపుగా 20 లక్షల వ్యూస్ వచ్చాయి.

అయితే స్కిట్ లో భాగంగా సద్దాం శ్రీముఖి తన భార్యని అనడంతో శ్రీముఖి అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో  కమెడియన్ సద్దాం ని నెగటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు.

కానీ కొందరు సద్దాం అభిమానులు మాత్రం ఇదంతా కేవలం  స్కిట్ లో భాగంగా ప్రేక్షకులను నవ్వించడానికి మాత్రమే అలా అన్నాడని తప్ప  ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదంటూ సమాధానాలు చెబుతున్నారు.

#Negativ Trolls #BommaAdirindi #Sreemukhi Fans #Saddam #Sreemukhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు