ఆర్యన్ బెయిల్ ఇప్పట్లో వచ్చేలా లేదుగా.. ఈరోజు మళ్ళీ విచారణ?

డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ గురించి ఇప్పటికే రెండుసార్లు కోర్టు నిరాకరించిన సంగతి మనకు తెలిసిందే.ఆర్యన్ తరఫు న్యాయవాదులు ఈ కేసు గురించి విచారించిన తర్వాత ఎన్సీబీ తరపున లాయర్లు వాదనను వినాల్సి ఉండగా కోర్ట్ వీరి వాదనను నేటికి వాయిదా వేయడంతో షారుక్ అభిమానులలో నేడు మరింత ఉత్కంఠత నెలకొంది.

 Bombay Hc Adjourns Aryan Khan Bail Hearing Till Tomorrow Aryan Khan, Drugs Case,-TeluguStop.com

నేడు కోర్టు విచారణలో భాగంగా ఏం జరుగుతుందా అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఆర్యన్ బెయిల్ విషయంపై మేజిస్ట్రేట్ కోర్టులో, ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక కోర్టులో బెయిల్ రిజెక్ట్‌ కాగా ఈసారైనా హైకోర్టులో ఆర్యన్ కు బెయిల్ వస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోని ఆర్యన్ ఖాన్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Telugu Aryan Khan, Bollywood, Bombay Hc, Drugs, Sharukh Khan-Movie

ఆర్యన్ కేవలం ఒక సెలబ్రిటీ కావడం వల్లనే ఈ కేసులో ఇరికించారు తప్ప అతను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించారు.ఇకపోతే అతని ఫోన్ చాటింగ్ చాలా రోజుల క్రితం జరిగినవని, ఆర్యన్ కేవలం తన స్నేహితుల వద్ద అతి తక్కువ పరిమాణంలో డ్రగ్స్ తీసుకున్నారు కనుక తనకు బెయిల్ ఇవ్వాలని ఆర్య తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించినట్లు తెలుస్తోంది.మరి ఆర్యన్ విషయంలో ఈ రోజైనా బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube