హీరో విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపులు.. చివరకు..?  

గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రంలోని స్టార్ హీరోలను టార్గెట్ చేసుకుని ఇళ్లలో బాంబు పెట్టామంటూ ఆగంతకుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.ఈ కాల్స్ ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలీదు కాని ఈ బెదిరింపు కాల్స్ వల్ల పోలీసుల విలువైన సమయం వృథా అవుతోంది.

TeluguStop.com - Bomb Threat To Hero Chiyan Vikram Residence Chennai

తాజాగా స్టార్ హీరో విక్రమ్ ఇంటిలో బాంబు పెట్టామంటూ ఆగంతకుల నుంచి చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చింది.

విక్రమ్ కు చెందిన చెన్నైలోని బసంత్ నగర్ ఇంట్లో బాంబు పెట్టామని ఆగంతుల నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.

TeluguStop.com - హీరో విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపులు.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image

బాంబ్ స్క్వాడ్ సహాయంతో విక్రమ్ ఇంటికి చేరుకుని అణువణువు గాలించారు.అయితే ఎంత వెతికినా బాంబు లభ్యం కాకపోవడంతో బాంబు బెదిరింపు కాల్ ఆకతాయిల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు బెదిరింపు కాల్ ఎవరు చేశారో గుర్తించే పనిలో పడ్డారు.

Telugu Bomb Threat, Chiyan Vikram, Cobra Movie, Residence In Chennai-Latest News - Telugu

గతంలో సూర్య, విజయ్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్ ఇళ్లలో బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన వ్యక్తి విల్లాపురం నుంచి ఫోన్ చేసినట్లు సమాచారం.పోలీసులను ఆట పట్టించేందుకు ఇలా కాల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మాత్రమే ఇలాంటి ఫేక్ కాల్స్ ఆగే అవకాశం ఉంది.

మరోవైపు చియాన్ విక్రమ్ వరుస సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు.

చివరగా కదరం కొండాన్ సినిమాలో చియాన్ విక్రమ్ కనిపించారు.

ప్రస్తుతం విక్రమ్ కోబ్రా సినిమాలో నటిస్తుండగా లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రష్యాలో తెరకెక్కించాల్సి ఉండగా సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత షూటింగ్ తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

#Chiyan Vikram #ResidenceIn #Bomb Threat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bomb Threat To Hero Chiyan Vikram Residence Chennai Related Telugu News,Photos/Pics,Images..