బాంబు ఎఫెక్ట్.. తాజ్ మహల్ పేల్చేస్తాం అలర్ట్ అయిన పోలీసులు..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలో తాజ్ మహల్ వద్ద ఆగంతకులు బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.దీంతో తాజ్ మహల్ ను తాత్కాలికంగా మూసివేశారు.

 Bomb Effect Police On Alert To Blow Up Taj Mahal-TeluguStop.com

పర్యాటకులను వెంటనే బయటకు పంపేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు.బాంబు స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగడంతో పరిసర ప్రాంతాలను జల్లెడ వేసే రీతిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి ఉత్తర ప్రదేశ్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు తెలపడంతో వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసులు అలర్ట్ అయ్యి తనిఖీలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఫోన్ కాల్ ఫిరోజాబాద్ నుండి వచ్చినట్లు గుర్తించారు.

 Bomb Effect Police On Alert To Blow Up Taj Mahal-బాంబు ఎఫెక్ట్.. తాజ్ మహల్ పేల్చేస్తాం అలర్ట్ అయిన పోలీసులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటి వరకు చేసిన తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని అగ్రా ఎస్పీ శివరామ్ యాదవ్ తెలిపారు.అయినా కానీ తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.

#Taj Mahal #Uttar Pradesh #Firozbad #Agra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు