వరుస బాంబు పేలుళ్ల తో దద్దరిల్లిన సోమాలియా  

Bomb Blast In Somalia-somalia

వరుస బాంబు పేలుళ్ల తో సోమాలియా మరోసారి దద్దరిల్లింది. సోమాలియా రాజధాని మొగదీష్ నగరంలో ఈ వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అధ్యక్ష భవనం సమీపంలోఒక బాంబు పేలుడు సంభవించగా,ఫోర్ట్ ఫీల్డ్ విమానాశ్రయం దగ్గర మరో పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది..

వరుస బాంబు పేలుళ్ల తో దద్దరిల్లిన సోమాలియా -Bomb Blast In Somalia

అయితే ఈ బాంబు పేలుళ్ల తో 14 మంది మృతి చెందగా,మరో 26 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తొలుత అధ్యక్ష భవనం దగ్గర పేలుడు జరిగిందని,ఆ తర్వాత ఫోర్ట్‌ఫీల్డ్ విమానాశ్రయం దగ్గర మరో పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే ఈ బాంబు పేలుళ్లకు అల్‌ఖైదా ఉగ్రవాద అనుబంధ సంస్థ అల్‌షబాబ్ బాధ్యత వహిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే ఈ విధంగా సోమాలియా లో అల్ షబాబ్ సంస్థ బాంబు పేలుళ్లు జరపడం ఇదే తొలిసారి ఏమీ గతంలో పలుసార్లు ఈ విధంగా బాంబు పేలుళ్లకు పాల్పడింది. గత అక్టోబర్‌లో జరిగిన బాంబు పేలుడు లో 500 మంది చనిపోయారు. అయితే ఈ పేలుళ్ల లో అల్‌షబాబ్ హస్తముందని దర్యాప్తులో తేలింది.

ఇప్పడు తాజాగా జరిగిన పేలుళ్ల తో 14 మంది మృతి చెందగా,26 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.