రాత్రి పూట పార్ట్ టైం ఆటో నడుపుతున్న ప్రముఖ నటి

సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నటులకి భారీ గా రెమ్యునరేషన్ ముడుతుంది.దాంతో వారంతా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు.

 Boman Iranis Auto Ride With Marathi Actress Driver-TeluguStop.com

అయితే డైలాగ్, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా ఉన్నవారికి రోజువారి రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటారు.అది కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది.

అయితే ఇలాంటి ఇబ్బందుల కారణంగా చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళే వారు వేరొక సంపాదన మార్గం కూడా చూసుకుంటారు.అమ్మాయిలు అయితే డబ్బులు సంపాదనకి షార్ట్ వేస్ వెతుక్కుంటారు.

కాని బాలీవుడ్ టెలివిజన్ సీరియల్స్ లో చెస్ ఒక నటి ఉదయం యాక్టింగ్ చేస్తూ రాత్రి వేళలో ఆటో నడుపుకుంటూ ఉంది.తాజాగా ఆమెతో దిగిన ఓ వీడియో ప్రముఖ నటుడు బోమన్ ఇరానీ షేర్ చేసాడు.

ఈ వీడియోలో ఆయన ఆ మహిళా డ్రైవర్‌ను అభినందిస్తూ కనిపిస్తున్నారు.అలాగే ఆమెకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఆమె ఒక టీవీ నటి అని, పగటిపూట యాక్టింగ్ చేస్తూ, రాత్రివేళ పార్ట్‌టైమ్‌గా ఆటో నడుపుతుంటారని బోమన్ తెలిపారు.అలాగే ఆ నటిపేరు లక్ష్మి అని, మరాఠీ సినిమాలు, టీవీ సీరియళ్లలోనూ నటిస్తుంటారని వివరించారు.

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోను చూసినవారంతా అటు బోమన్ ఇరానీని, ఇటు లక్ష్మిని అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube