బాలీవుడ్‌ మీడియా 'సాహో' విషయంలో అలా, 'సైరా' విషయంలో ఇలా

ఈమద్య కాలంలో తెలుగు సినిమాల మార్కెట్‌ బాగా పెరింది.తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్‌ చేయగా వందల కోట్ల రూపాయలు వసూళ్లు అవుతున్నాయి.

 Bollywoodmedia About Saaho And Sye Raa Narasimhareddy-TeluguStop.com

తెలుగు పరిశ్రమకు చెందిన పలు సినిమాలు హిందీలో రీమేక్‌ అవుతున్నాయి.అందులో ఎక్కువ శాతం సక్సెస్‌ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ మీడియా తెలుగు సినిమాల విషయమై కోడి గుడ్డపై ఈకలు పీకడం చేస్తుంది.అంటే తెలుగు సినిమాలను చిన్న చూపు చూస్తూ ఏదో విధంగా విమర్శలు చేస్తోంది.

అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కబీర్‌ సింగ్‌ను మొదట బాలీవుడ్‌ మీడియా తిరష్కరించినా కూడా ప్రేక్షకులు మాత్రం మంచి సక్సెస్‌ను అందించారు.ఇక సాహో చిత్రంకు బాలీవుడ్‌ మీడియా బ్యాడ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేసింది.

అయినా కూడా సినిమా యావరేజ్‌ అంటూ ప్రేక్షకుల టాక్‌తో అక్కడ భారీ వసూళ్లను నమోదు చేసింది.అందుకే సైరా చిత్రం కూడా బాలీవుడ్‌ మీడియాకు బలి అవ్వాల్సిందే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాని నిన్న విడుదలైన సైరాకు బాలీవుడ్‌ మీడియా బ్రహ్మరథం పడుతోంది.

Telugu Bollywood, Chiranjeevi, Nayanatara, Prabhas, Saaho, Syeraa, Tamanna-

చాలా మంది సినీ ప్రముఖులు మరియు బాలీవుడ్‌ ట్రేడ్‌ ఎనలిస్ట్‌లు సినిమా విషయంలో చాలా పాజిటివ్‌గా స్పందించారు.కొందరు ఏకంగా 4.5/5 రేటింగ్‌ ఇచ్చారు.బాలీవుడ్‌ మీడియా ఓవరాల్‌ రేటింగ్‌ చూస్తే 3.75 ఉంది.అంటే ఇది చాలా మంచి రేటింగ్‌.అదే సాహోకు ఓవరాల్‌ రేటింగ్‌ కేవలం 2 కూడా లేదు.అందుకే సైరా చిత్రంకు బాలీవుడ్‌ మీడియా సహకారం దక్కిందని మెగా ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube