బేబమ్మ కి కాంపిటీషన్... అల్లు అర్జున్ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న మరో ముంబై హీరోయిన్...

టాలీవుడ్ లో ప్రస్తుతం ముంబై హీరోయిన్లకి మంచి డిమాండ్ ఉంది.  ఈ క్రమంలో రెమ్మ్యూనరేషన్ మరియు క్రేజ్ పరంగా మాత్రమే కాకుండా ఇక్కడ ఒక్క సినిమా హిట్టయితే కెరియర్ టర్న్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 Bollywood Young Heroine Saiee M Manjrekar Got Chance In Stylish Star Allu Arjun-TeluguStop.com

దీంతో కొందరు ముంబై బ్యూటీలు ఇక్కడ హిట్ అందుకుని బాలీవుడ్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ప్రస్తుతం తెలుగులో టాలీవుడ్ సినీ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించే హీరోయిన్ విషయం పై ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే బాలీవుడ్  యంగ్ హీరోయిన్ మరియు మోడల్ “సయూ ఎమ్ మంజ్రేకర్” ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే సయూ ఎమ్ మంజ్రేకర్ గతంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన “దబాంగ్ 3” చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడికి కూడా పెద్దగా గుర్తింపు లభించలేదు.

తెలిసిన వారి ద్వారా అల్లు అర్జున్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో అవకాశం దక్కించుకుని టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతోందని మరికొందరు చర్చించుకుంటున్నారు.తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించే అవకాశం ఉంది.

దీంతో ఇటీవలే ఉప్పెన చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి కి సయూ ఎమ్ మంజ్రేకర్ అవకాశాల పరంగా గట్టి పోటీ ఇవ్వనుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Allu Arjun, Bollywood Young, Bollywoodyoung, Gani, Koratala Siva, Saiee M

అయితే ఈ  విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సయూ ఎమ్ మంజ్రేకర్ తెలుగులో వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న “గని” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండబోతున్నట్లు సమాచారం.

కాగాఇటీవలే  తెలుగు ప్రముఖ నటుడు “అడవి శేష్” హీరోగా నటిస్తున్న “మేజర్” చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.ఈ చిత్రం ముంబైలో జరిగిన 26/11 ఘటన ఆధారంగా తెరకెక్కుతోంది.

 కాగా ఈ చిత్రంలో అడవి శేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.అలాగే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నిర్మిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube