బాలీవుడ్ అంటేనే కంటెంట్ తక్కువ కాస్టింగ్, కాస్ట్, కమర్షియాలిటీ ఎక్కువ.సౌత్ మూవీస్ తో పోలిస్తే వాళ్లు కంటెంట్ విషయంలో చాలా పూర్.
సినిమా అనేది మనం ప్యూర్ ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తే.బాలీవుడ్ ప్యూర్ బిజినెస్ లా చూస్తుంది.
ఈ మధ్య బాలీవుడ్ తెలుగుతో పాటు సౌత్ రిమేక్ సినిమాల మీద పడింది.తక్కువ రేటుకు రీమేక్ రైట్స్ తీసుకుని మన స్టోరీస్ మొత్తం బాలీవుడ్ టచ్ ఇచ్చి పైసలు రాబట్టుకోవడం ఫ్యాషన్ అయ్యింది.
కానీ ఇలా వీళ్లు తెలుగు హిట్ సినిమాలను తీసుకుని చేతులు కాల్చుకున్న సందర్భాలు ఈ మధ్య చాలా ఉన్నాయి.రీసెంట్ గా దుర్గామతి, లక్ష్మి సినిమాలతో పాటు బాలీవుడ్ లో ఫ్లాప్ అయిన తెలుగు రీమేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
లక్ష్మీబాంబ్-కాంచనతెలుగులో మంచి విజయం సాధించిన కాంచన సినిమాను బాలీవుడ్ లో లక్ష్మీ పేరుతో రీమేక్ చేసి ఫ్లాప్ అయ్యారు.
దుర్గామతి-భాగమతి

అనుష్క హిట్ మూవీ భాగమతిని బాలీవుడ్ లో దుర్గామతి పేరుతో తీసి అపజయాన్ని మూటగట్టుకున్నారు.
తేవర్-ఒక్కడు

మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాను బాలీవుడ్ లో తేవర్ పేరుతో తెరకెక్కించారు.ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఏక్-అతడు

తెలుగులో సూపర్ హిట్ అయిన అతడు సినిమాను హిందీలో ఏక్ పేరుతో తెరకెక్కించి చేతులు కాల్చుకున్నారు.
సన్ ఆప్ సర్దార్- మర్యాద రామన్న

రాజమౌళి దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన మర్యాద రామన్న సినిమాను బాలీవుడ్ లో సన్ ఆఫ్ సర్దార్ పేరుతో తీశారు.ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ప్రస్థానం-ప్రస్థానం

తెలుగులో సూపర్ హిట్ మూవీ ప్రస్థానం.అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశారు.సినిమా ఫెయిల్ అయ్యింది.
భాగి-2- క్షణం

తెలుగులో వచ్చిన క్షణం మూవీని బాలీవుడ్ లో భాగి-2తో తీశారు.ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
హీరోపంతి-పొగరు

పొగరు సినిమాను హీరోపంతి పేరుతో తెరకెక్కించి పరాజయం పాలయ్యారు.
సింబా-టెంపర్

తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సూపర్ మూవీ టెంపర్.బాలీవుడ్ లో సింబా పేరుతో తెరకెక్కి బోల్తా కొట్టింది.
జయహో-స్టాలిన్

మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ స్టాలిన్ ను బాలీవుడ్ లో జయహో పేరుతో తీసి అపజయాన్ని మూటగట్టుకున్నారు.