ఐటెంలను బహిష్కరిస్తున్న బాలీవుడ్‌?   Bollywood Wants To Ban Item Songs About Metoo Movement     2018-10-16   09:34:02  IST  Ramesh P

నానా పటేకర్‌, తనూశ్రీ దత్తా వ్యవహారం తర్వాత బాలీవుడ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోల వరకు ఎవరు తమపై లైంగిక ఆరోపణలు చేస్తారో, ఎవరి నుండి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అంటూ వణికి పోతున్నారు. మీటూ ఉద్యమం పేరుతో కొందరు పెద్ద మనుషుల పరువు తీసేలా కొందరు వ్యవహరిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ సంచలన నిర్ణయాన్ని తీసుకుని అందరిని ఆశ్చర్యపర్చారు.

ఆడవారిని చులకనగా చూపించడంతో పాటు, ఆడవారి అందాల ప్రదర్శణ మరియు వారి గురించి తప్పుగా చూపించడం వల్లే లైంగిక వేదింపులు ఎక్కువ అవుతున్నాయనే చర్చ జరుగుతుంది. అందుకే ఇకపై హిందీ సినిమాల్లో ఆడవారిని తప్పుగా చూపించకుండా ఉండటంతో పాటు, ఆడవారి పట్ల గౌరవం పెంపొందేలా సీన్స్‌ను తీయాలని, చేయాలని హిందీ ఫిల్మ్‌ మేకర్స్‌ భావిస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నారు.

బాలీవుడ్‌లో మాస్‌ సినిమాలు అంటే ఖచ్చితంగా స్టార్స్‌తో ఐటెం సాంగ్‌ ఉండాల్సిందే. బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌ వరవడి పాతుకు పోయిన విషయం తెల్సిందే. అయితే ఆ వరవడికి బ్రేక్‌ వేయాలని, ఇకపై ఐటెం సాంగ్స్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఐటెం సాంగ్స్‌ చేసి, విడుదల కాని సినిమాల్లోంచి ఆ సాంగ్స్‌ను తీసేయడంతో పాటు, ముందుగానే ప్లాన్‌ చేసుకున్న ఐటెం సాంగ్స్‌ను తొలగించడం జరుగుతుంది.

Bollywood Wants To Ban Item Songs About Metoo Movement-

ఐటెం సాంగ్స్‌ వల్ల యువత పెడద్రోవ పడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌ వల్ల కోట్ల బిజినెస్‌ జరుగుతుంది. కాని ఇప్పుడు మీటూ ఉద్యమం కారణంగా ఐటెం సాంగ్‌లను బహిష్కరించి పెద్ద సాహసంకు ఫిల్మ్‌ మేకర్స్‌ తెర లేపినట్లే అంటే సినీ వర్గాల వారు అంటున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.