నేను ఆ సినిమాలో నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్….  

Bollywood veteran heroine Sameera reddy Gives clarity about her second innings, Sameera reddy, Bollywood heroine, Telugu actress, Second innings, Malayalam Movie fake news, Tollywood, Narasimhudu movie heroine, - Telugu Bollywood Heroine, Malayalam Movie Fake News, Narasimhudu Movie Heroine, Sameera Reddy, Second Innings, Telugu Actress, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించిన “నరసింహుడు” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి “సమీరా రెడ్డి” గురించి తెలుగు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Bollywood Veteran Heroine Sameera Reddy Gives Clarity About Her Second Innings

అయితే నరసింహుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన జై చిరంజీవ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.కానీ ఈ అమ్మడికి హిందీ, తమిళం, మలయాళం, తదితర భాషలలో సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో కొంతమేర తెలుగు సినిమా పరిశ్రమకు దూరం అయింది.

అయితే పెళ్లయిన తర్వాత సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసిన సమీరా రెడ్డి ప్రస్తుతం తన కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ ఇంటిపట్టునే ఉంటుంది.  కాగా తాజాగా సమీరా రెడ్డి ఓ మలయాళ చిత్రం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వైరల్ అవుతున్నాయి.

TeluguStop.com - నేను ఆ సినిమాలో నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఇటీవలే ఈ విషయంపై నటి సమీరా రెడ్డి స్పందిస్తూ తాను ఎలాంటి చిత్రాలలో నటించడం లేదని స్పష్టం చేసింది.అంతేగాక తన భర్త పిల్లలతో కలిసి ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నానని తన గురించి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసి మళ్లీ డిస్టర్బ్ చేయొద్దని కోరింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో చివరిగా సమీరా రెడ్డి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి హీరోగా నటించినటువంటి “కృష్ణం వందే జగద్గురు” అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన టువంటి అక్షయ్ వర్దా అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకొని ముంబైలో సెటిల్ అయ్యింది.

కాగా ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

#Second Innings #MalayalamMovie #Sameera Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Veteran Heroine Sameera Reddy Gives Clarity About Her Second Innings Related Telugu News,Photos/Pics,Images..