అలాంటి ఫోటోని షేర్ చేసిన సీనియర్ హీరోయిన్.. ఈ వయసులో అవసరమా అంటూ..

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, తదితర సినీ పరిశ్రమలో తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి మాధురీ దీక్షిత్ దాదాపుగా 100కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

 Bollywood Veteran Heroine Madhuri Dixit Looks Stunning In Beach-TeluguStop.com

ఈ మధ్యకాలంలో వయసు మీద పడటంతో హీరోయిన్ గా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమయినా బాగానే అలరిస్తోంది.

 Bollywood Veteran Heroine Madhuri Dixit Looks Stunning In Beach-అలాంటి ఫోటోని షేర్ చేసిన సీనియర్ హీరోయిన్.. ఈ వయసులో అవసరమా అంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మాధురీ దీక్షిత్ కి 52 ఏళ్ళ వయసు పైబడినప్పటికీ ఇప్పటికీ వన్నె తరగని అందంతో ప్రేక్షకులని బాగానే కట్టిపడేస్తుంది.కాగా ఈ మధ్య కాలంలో మాధురీ దీక్షిత్ సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులకి అందుబాటులో ఉంటోంది.

తాజాగా మాధురీ దీక్షిత్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో కొంతమేర మాధురి దీక్షిత్ స్లీవ్ లెస్ దుస్తులు ధరించి సముద్రం ఒడ్డున హొయలు పోతూ కనిపించింది.అంతేకాక ఈ ఫోటోకి ది మ్యాజిక్ హవర్ అని క్యాప్షన్ కూడా పేరు పెట్టింది.దీంతో ఈ ఫోటోని షేర్ చేసిన రెండు రోజుల్లోనే దాదాపుగా ఏడు లక్షల పైచిలుకు మంది నెటిజన్లు లైకులు, కామెంట్లు చేశారు.

అంతేకాకుండా మాధురీ దీక్షిత్  ఇప్పటికే ఎంతో మందికి కలల రాణిగా ఉండడంతో అందాల ఆరబోతకు ఫిదా అయ్యారు.మరికొంతమంది మాత్రం పెళ్లయి భర్త పిల్లలు ఉన్నటువంటి ఓ మహిళ ఇలాంటి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా మాధురి దీక్షిత్ ఆమధ్య హిందీలో ప్రముఖ దర్శకుడు అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహించిన కళంక్ చిత్రంలో ప్రముఖ నాట్య కారిణి పాత్రలో కనిపించింది.ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది.

ఏదేమైనప్పటికీ 1985వ సంవత్సరంలో ప్రసారమైన ఓ చిన్న ధారా వాహిక ద్వారా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మాధురీ దీక్షిత్  ఏకంగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది.పెళ్లయిన తర్వాత కూడా అడపాదడపా చిత్రాల్లో నటించి బాగానే ప్రేక్షకులను అలరించింది.

కాగా ప్రస్తుతం కలర్స్ టీవీ లో ప్రసారమయ్యే డ్యాన్స్ దివానీ అనే డాన్స్ కాంపిటీషన్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

#MadhuriDixit #Madhuri Dixit #@MadhuriDixit

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు