మేమేమి రేసు గుర్రాలు కాదంటున్న స్టార్ హీరోయిన్…  

Bollywood Veteran Actress Madhuri Diskshith Reviled About Her Friendship With Sri Devi - Telugu Bollywood, Bollywood Veteran Actress, Friendship News, Madhuri Dixit, Sri Debvi

ఒకప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమలో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందిన నటి మాధురి దీక్షిత్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈమె తన అందం, అభినయం, నటనతో ఒక బాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, ఇలా భాషతో సంబంధం లేకుండా తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

 Bollywood Veteran Actress Madhuri Diskshith Reviled About Her Friendship With Sri Devi

అప్పట్లో తనకు టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి స్వర్గీయ నటి శ్రీదేవి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇందులో అప్పట్లో తాను  మరియు శ్రీదేవి సినీ పరిశ్రమలో పోటీపడినటించిన మాట వాస్తవమే అయినప్పటికీ తమ మధ్య ఎప్పుడూ కూడా వ్యక్తిగత పోటీ లేదని కేవలం తాము పని పరంగా మాత్రమే పోటీ పడ్డామని చెప్పుకొచ్చింది.

మేమేమి రేసు గుర్రాలు కాదంటున్న స్టార్ హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

కానీ నటి శ్రీదేవి నటించిన చిత్రాలు మరియు నటించే తీరు వంటి వాటిలో తన కంటే ఎన్నో రెట్లు ముందు ఉందని వ్యాఖ్యానించింది.అలాగే తమ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవని కూడా తెలిపింది.

అయితే కొంత మంది అభిమానులు తమ అభిమాన నటీనటులపై ఉన్నటువంటి అభిమానం కారణంగా ఎవరు గొప్ప అనే విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారని కానీ తాము మాత్రం ఎప్పుడు అలాంటి చర్చలకు తావు ఇవ్వలేదని తెలిపింది.అలాగే తాము రేసు గుర్రాలు కాదని కూడా ఉదాహరణగా వ్యాఖ్యానించింది.

అయితే ఈ విషయంలో ఉండగా గతంలో చాలా కాలం తర్వాత సినీ పరిశ్రమకు 2019 సంవత్సరంలో విడుదలైనటువంటి కళంక్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.వచ్చి రావడంతోనే మాధురి దీక్షిత్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

మరోపక్క పలు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test