నటిపై ఉబర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన,అరెస్ట్  

Actress Swastik Harassed By Uber Cab Driver-telugu Viral News Updates,viral In Social Media,నటిపై ఉబర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన

సామాన్య స్త్రీల కే కాదు ప్రముఖ నటులపై కూడా హెరాస్మెంట్స్ తప్పడం లేదు. ఈ రోజుల్లో మహిళలు,చిన్నారులు అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా మహిళల పై అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల వరంగల్ జిల్లా లో 9 నెలల చిన్నారిపై ఒక సైకో అఘాయిత్యానికి పాల్పడిన ఘటన గాని, ఇలా పలు ఘటనలు నిత్యం మనం వార్తల్లో చదువుతూనే ఉంటున్నాం. అయితే ఈ లైంగిక దాడులు సామాన్య మహిళలపై నే కాకుండా సెలబ్రిటీ లు కూడా ఇబ్బందిపెడుతున్నారు..

నటిపై ఉబర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన,అరెస్ట్-Actress Swastik Harassed By UBER Cab Driver

తాజాగా ప్రముఖ బెంగాల్‌ టీవీ సీరియల్‌ నటి స్వస్తికా దత్త పట్ల ఉబర్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే…. సీరియల్‌ షూటింగ్‌కు వెళ్లడానికి బుధవారం ఉదయం స్వస్తికాదత్త ఉబెర్‌ క్యాబ్‌ను బుక్‌ చేశారు. అయితే కారు లో షూటింగ్‌ స్పాట్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్‌ బుకింగ్‌ను క్యాన్సిల్‌ చేసి, ఆమెను కారు లో నుంచి బయటికి లాగాలని ప్రయత్నించాడు.

దాని తో ఆమె ప్రతిఘటించడంతో కారులోనే మరో చోటికి తీసుకెళ్లడానికి యత్నించడమే కాకుండా, ఫోన్‌లో తన ఫ్రెండ్స్‌ని కూడా రమ్మన్నాడు.

దీంతో బెదిరిపోయిన నటి కారుదిగి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్‌ కారుతో సహా పారిపోయాడు. ఇదంతా కేవలం అరగంట వ్యవధిలో జరిగిందని స్వస్తికా దత్త సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించడం తో పాటు కారు నెంబర్‌, డ్రైవర్‌ పేరుతో సహా వివరాలను షేర్ చేశారు. దీనితో వెంటనే స్పందించిన పోలీసులు ఆ ఉబర్ డ్రైవర్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

నటిపై కూడా ఈ విధంగా అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రయత్నించిన డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.