కొడుకుకి ఫిట్ నెస్ ట్రైనర్ గా మారిపోయిన సోనూసూద్

కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.ఇక ఈ నేపధ్యంలో సినిమా షూటింగ్ లు, రోజువారి పనులు అన్ని బంద్ అయిపోయి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు.

 Sonu Sood's Son Eshaan's Pics Are Going Viral, Bollywood, Tollywood, Lock Down,-TeluguStop.com

ఈ టైంని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగించుకుంటున్నారు.కొంత మంది నటులు వంటింట్లో గరిటె తిప్పే పనిలో పడితే.

కొంత మంది భార్యలకి రెస్ట్ ఇచ్చి ఇంటి పని చేస్తున్నారు.కొంత మంది గార్డెనింగ్ లో బిజీగా గడుపుతున్నారు.

ఈ కరోనా కారణంగా ఇంట్లో పని చేసే పనివాళ్ళు కూడా లేకపోవడంతో ఇంటిపని, వంట పని, బట్టలు వాష్ చేసుకోవడం అన్ని కూడా సెలబ్రిటీలు స్వయంగా చేసుకుంటున్నారు.

ఇక అరుందతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకులని మెప్పించి స్టార్ విలన్ గా తనదైన ముద్ర వేసిన సోనూ సూద్ అయితే ఫిట్ నెస్ ట్రైనర్ గా మారిపోయి కొడుకుకి కండలు పెంచడం నేర్పిస్తున్నాడు.

కొడుకు ఇషాంత్ సూద్ తో కలిసి కండలు పెంచడం ఎలాగో చేసి చూపిస్తున్నాడు.పెర్ఫెక్ట్ బాడీ ఫిట్ నెస్ మెయింటేన్ చేసే సోనూసూద్ కూడా బాడీ విషయంలో తండ్రి కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాడు.

తండ్రికొడుకుల ఫిట్ నెస్ ట్రైనింగ్ ఫోటోలని సోనూ సూద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇప్పుడు అవి వైరల్ గా మారుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube