సీఆర్పీఎఫ్ జవాన్ లపై ఉగ్రదాడి! సంతాపం తెలియజేసిన ప్రముఖులు!

జమ్ము కాశ్మీర్లో శ్రీనగర్ నేషనల్ హైవేపై సిఆర్పీఎఫ్ జవాన్ల పై ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.మావోయిస్టు బందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ గా వెళ్ళిన జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు.

 Bollywood Tollywood Celebrities Big Condolence To Crpf Jawans-TeluguStop.com

ఆత్మాహుతికి పాల్పడిన టెర్రరిస్ట్ ని ఇప్పటికే భద్రత సిబ్బంది గుర్తించడం జరిగింది.ఆత్మహుతి దాడి తర్వాత కూడా ఉగ్రవాదులు ఒక్కసారిగా సిఆర్పిఎఫ్ జవాన్లు పై కాల్పులు చేయడం, జవాన్లు కూడా ఎదురు కాల్పులు చేయడం జరిగింది.

ఈ ఆత్మహుతి దాడి, కాల్పుల కారణంగా సుమారు 44 మంది జవాన్లు మృతి చెందినట్లు సిఆర్పిఎఫ్ అధికారులు నిర్ధారించారు.

ఇదిలా ఉంటే గత ఐదు సంవత్సరాలలో ఉగ్రవాదుల నుంచి భారత సైన్యం పై జరిగిన అతి పెద్ద ఉగ్ర దాడి ఇదని తెలుస్తోంది.

భారత సరిహద్దుల్లో యూరీ దాడుల తర్వాత ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఐదేళ్ల కాలంలో మొదటిసారని తెలుస్తుంది.అయితే దీనిపై ఇప్పటికే హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ తీవ్రస్థాయిలో స్పందించి ఉగ్రదాడి ప్రతీకార చర్య తప్పదని హెచ్చరించారు.

ఈ ఆత్మాహుతి దాడిలో చనిపోయిన సైనికులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ప్రకటించారు.ఇక ఈ సీఆర్పీఎఫ్ పై ఆత్మాహుతి దాడి ఘటన పై బాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఇప్పటికీ ఈ ఉగ్రదాడి ని జైషే మహమ్మద్ అనే తీవ్రవాద సంస్థ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది దీనిపై ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుందనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube