బాలీవుడ్ స్టార్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వారు వేసుకునే డ్రెస్ నుంచి వారు తిరిగే కార్లు, వారు ఉండే ఇల్లు అన్నీ కూడా ఖరీదైనవే.
వారి ఇల్లు చూస్తే ఎవరికైనా సరే కళ్లు తిరగాల్సిందే.ఆ రేంజ్ లో వాళ్ళ ఇల్లు ఉంటాయ్.ఎంతో ఖరీదైన విలాసవంతమైన ఇళ్లలో నివసించే బాలీవుడ్ సెలబ్రెటీలు ఎవరో అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అమితాబచ్చన్
బాలీవుడ్ స్టార్ నటుడు ‘అమితాబ్ బచ్చన్’కు ముంబైలో 5 బంగ్లాలు ఉన్నాయి.వీటిలో ప్రతీక్ష అనే బిల్డింగ్ లో బిగ్ బి తన యుక్త వయసు గడిపారట.అక్కడ నుండి జల్సా అనే మరో బంగ్లాకు మారారు.ఈ బంగ్లా అప్పట్లో షోలే అనే సినిమా సక్సెస్ అయినందుకు దర్శకుడు రమేష్ సిప్పీ ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చారట.ఈ బంగ్లా ఖరీదు సుమారు 50 కోట్ల రూపాయిలు.
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ కు ముంబైలోని బాంద్రా వెస్ట్ లో ఉన్న గెలాక్సీ అపార్ట్మెంట్లో 2 బి హెచ్ కె ఫ్లాట్లు ఉన్నాయి.ఒక్కో ఫ్లాటు ఖరీదు 16 కోట్ల చేస్తుంది.అలాగే సల్మాన్ ఖాన్ కి దుబాయ్ లో లెక్కపెట్టలేనన్ని ఆస్తులు ఉన్నాయి.
సైఫ్ అలీ ఖాన్
సైఫ్ అలీఖాన్ కు తమ వంశ పారంపర్యంగా వచ్చిన ప్యాలెస్ ఒకటి హర్యానాలో ఉంది.దాన్ని ఇబ్రహీం కోట అని పిలుస్తారు.ఈ ప్యాలెస్ ఖరీదు 75 కోట్లు దాన్ని 1800 సంవత్సరంలో నిర్మించారు.
సైఫ్ ది నవాబులు కుటుంబం కనుక తనకు వారసత్వంగా ఈ బంగ్లా వచ్చింది.ఇంకా ముంబై లో 70 కోట్ల ఖరీదు చేసే విలాసవంతమైన అపార్ట్ మెంట్ కూడా ఉంది.
షారుక్ ఖాన్
షారుక్ ఖాన్ కు 200 కోట్ల విలువ చేసే బంగ్లా ఉంది.దాని పేరు మన్నత్.ప్రపంచంలో ఖరీదైన టాప్ టెన్ బంగ్లాలో ఇది ఒకటిగా పేరుగాంచింది.ఇంకా దుబాయ్ లండన్ లోను షారుక్ ఆస్తులు ఉన్నాయి.
అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ కి ముంబై ప్రైమ్ బీచ్ లో 20 కోట్ల విలువ చేసే 2 స్టేర్ బంగ్లా ఉంది.ఇవే కాకుండా అక్షయ్ కుమార్ కి తన పెద్దల నుంచి వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి.