ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యునరేషన్ తో పోలిస్తే బాలీవుడ్ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తం కాగా కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లు అంచనాలకు అందని స్థాయిలో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.లేడీ ఓరియెంటెడ్ సినిమాకు హీరోయిన్లు మరింత ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకుంటూ ఉండటం గమనార్హం.

 Bollywood Star Heroines Remuneration 2022 Details Here Goes Viral Details, Boll-TeluguStop.com

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎక్కువమంది హీరోయిన్లు 10 కోట్ల రూపాయలకు అటూ ఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కంగనా రనౌత్ కు ఫైర్ బ్రాండ్ గా పేరుంది.

ఈమె ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.సినిమాను బట్టి ఈ బ్యూటీ 25 కోట్ల రూపాయల వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయలకు అటూ ఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

తెలుగు సినిమాలలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న అలియా భట్ కూడా 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

సినిమాను బట్టి అలియా భట్ తీసుకునే రెమ్యునరేషన్ లో మార్పు ఉంటుందని సమాచారం అందుతోంది.ప్రియాంక చోప్రా 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండగా కత్రినా కైఫ్ 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

విద్యాబాలన్ 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండగా శ్రద్ధా కపూర్ 7 కోట్ల రూపాయలు, తాప్సీ 5 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.ఇతర బాలీవుడ్ హీరోయిన్లు కోటిన్నర రూపాయల నుంచి రెండున్నర కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మాత్రం ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్ 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల మధ్య ఉండటం గమనార్హం.

సినిమా సినిమాకు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రెమ్యునరేషన్ ను పెంచుతుండటం గమనార్హం.

Bollywood Star Heroines Remuneration 2022 Details Here Goes Viral Details, Bollywood Heroines, Bollywood Heroines Remuneration, Kangana Ranaut, Deepika Padukone, Alia Bhatt, Taapsee, Vidyabalan, Katrina, Shraddha - Telugu Alia Bhatt, Aliya Bhatt, Bollywood, Kangana Ranaut, Katrina, Shraddha, Taapsee, Vidyabalan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube