బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్స్ టాలీవుడ్ల సత్తా చాటలేకపోయారు.అక్కడి కంటే ఇక్కడ ఎక్కువ పారితోషకం ఇచ్చి మరీ తీసుకొచ్చినా.
ఫలితం లేకుండా పోయింది.బాలీవుడ్‌ను ఊపిన ఆ హీరోయిన్స్ యాక్టింగ్ ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ఇక్కడ విఫలమైనా మళ్లీ బాలీవుడ్లో రాణించారు సదరు నటీమణులు.ఇంతకీ తెలుగులో సక్సెస్ కాని ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం!
ప్రియాంక చోప్రా:

రాంచరణ్ తొలి బాలీవుడ్ సినిమా జంజీర్.ఈ సినిమాను తెలుగులో తుఫాన్ పేరుతో విడుదల చేశారు.బాలీవుడ్ టాప్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు.ఈ సినిమా తర్వాత ప్రియాంకకు తెలుగులో ఎలాంటి అవకాశం రాలేదు.
బిపాసా బసు:

మహేష్ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో బిపాసా బసు హీరోయిన్ గా చేసింది.ఆ తర్వాత తెలుగులో ఎలాంటి అవకాశం రాలేదు.
కంగన రనౌత్:

ప్రభాస్ తో కలిసి టాలీవుడ్లో ఎక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్గా చేసింది.ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్లు రాలేదు.బాలీవుడ్ లో మాత్రం టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ట్వింకిల్ ఖన్నా:

వెంకటేష్ తో కలిసి శ్రీను సినిమాలో హీరోయిన్ గా చేసింది ట్వింకిల్ ఖన్నా.ఆ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో అడుగు పెట్టలేదు.బాలీవుడ్ లో మాత్రం చాలా సినిమాల్లో నటించింది.
మనీషా కోయిరాల:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాల.టాలీవుడ్ లో మాత్రం సక్సెస్ కాలేదు.నాగార్జునతో కలిసి క్రిమినల్ సినిమా చేసింది.
ఆ తర్వత తెలుగులో అవకాశాలు రాక.బాలీవుడ్‌కు చేరింది.
అమృత రావు:

మహేష్ బాబు అతిధి సినిమాలో హీరోయిన్ గా చేసింది అమృత రావు.ఆ తర్వాత ఆమెకు ఇక్కడ అవకాశాలు రాలేదు.మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లిపోయింది.
అయేషా టాకియా:

నాగార్జునతో సూపర్ సినిమాలో హీరోయిన్ గా చేసిన అయేషా టాకియా… తన అందాలతో యువకులను ఆకట్టుకుంది.కానీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు.బాలీవుడ్లో మాత్రం చలా సినిమాలు చేసింది.
అమిషా పటేల్:

పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రిలో నటించింది.మహేష్ బాబుతో నాని సినిమాల్లో యాక్ట్ చేసింది.ఆ తర్వాత అవకాశాలు రాలేదు.