ఆ స్టార్ 'హీరోయిన్'కి మంత్రి నుంచి ఆహ్వానం.. నో అన్నందుకు ఆ విధంగా?  

ఇటీవల కాలంలో ఎవరైనా ఏదైనా పని చెప్పినప్పుడు నో చెప్పమంటే చాలు.కోపం పెంచేసుకుంటారు.

TeluguStop.com - Bollywood Star Heroine Vidhya Balan Maharastra Minester Vijay Sha

పగలు పెంచేసుకుంటారు.ఎప్పుడు ఛాన్స్ వస్తుందా? అని ట్రై చేస్తారు.అలా ఒక్కసారి అవకాశం వచ్చింది అంటే చాలు వారు కూడా నో చెప్తారు.గతంలో ఎన్ని సార్లు మంచి చేసిన గుర్తు ఉండవు.ఒక్కసారి నో చెప్పినదే గుర్తు ఉంటుంది ఈ మనుషులకు.ఇక అలానే ఓ స్టార్ హీరోయిన్ ని డిన్నర్ కు రావాలని మంత్రి ఆహ్వానించాడు.

ఆమె కుదరదని గట్టిగా చెప్పింది.

TeluguStop.com - ఆ స్టార్ హీరోయిన్’కి మంత్రి నుంచి ఆహ్వానం.. నో అన్నందుకు ఆ విధంగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇంకేముంది.

హీరోయిన్ కి నీకు ఏ అంత పొగరు ఉంటే మంత్రిని నాకెంత పొగరుండాలి అని అనుకున్నాడో ఏమో తెలీదు కానీ.అవకాశం రాగానే దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాడు.

ఎవరు ఆ స్టార్ హీరోయిన్? ఎవరు ఆ మంత్రి? అంత షాక్ హీరోయిన్ కి ఏం ఇచ్చాడు అని మీకు సందేహం రావచ్చు… అక్కడికే వస్తున్న.ఆ మంత్రి మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కాదు లెండి.

అలాగే హీరోయిన్ కూడా మన టాలీవుడ్ భామ కాదు.

బాలీవుడ్ ముద్దుగుమ్మ విద్యాబాలన్ కు ఈ ఘటన ఎదురైంది.ప్రస్తుతం విద్య బాలన్ షేర్నీ అనే సినిమాలో నటిస్తుంది.ఆ సినిమా షూటింగ్ మధ్య ప్రదేశ్ అడవులలో చెయ్యాల్సి ఉంది.

దీంతో మధ్యప్రదేశ్ మినిస్టర్ వద్దకు పర్మిషన్ కోసం వెళ్లారు.అయితే దొరికిందే ఛాన్స్ అని అనుకున్న మంత్రి విద్యాబాలన్ ను డిన్నర్ కి రావాలని ఆహ్వానించాడు.

ఆమె అందుకు నిర్మొహమాటంగా నో చెప్పడంతో మంత్రి సినిమా షూటింగ్ ని కూడా నిర్మొహమాటంగా క్యాన్సిల్ చేశాడట.

ఇక ఈ విషయంపై మీడియాలో ఓ రేంజ్ లో కథనాలు రావడంతో మంత్రి విజ‌య్ షా కూడా దీనిపై స్పందించి ఆమెను డిన్నర్ కి పిలవలేదని చిత్ర యూనిట్ ఏ డిన్నర్ కు అతన్ని ఆహ్వానించిందని అతను సినిమా షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వకపోవడంతో వాళ్ళు డిన్నర్ ని క్యాన్సిల్ చేసినట్టు వివరణ ఇచ్చాడు.

అయితే ప్రస్తుతం మాత్రం ఈ వార్త నెట్టింట తెగ హాల్ చల్ అవుతుంది.

#Maharastra #ViralNews #BollywoodStar #Vidhya Balan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు