స్టార్‌ హీరోయిన్‌ భర్త బూతు సినిమాలు చేస్తున్నట్లుగా కేసు నమోదు!

బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ సినీ ప్రేక్షకులకు మరియు అభిమానులకు సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ శిల్పా శెట్టి అనూహ్యంగా మీడియాలో నిలిచింది.ఎప్పుడు ఆమె సినిమా లు ఇతర విషయాల వల్ల మీడియాలో ఉండే ఆమె ఈసారి మాత్రం అనూహ్యంగా భర్త వివాదం వల్ల వార్తల్లో నిలిచింది.

 Bollywood Star Heroine Shilpa Shetty Husband Arrested-TeluguStop.com

శిల్ప శెట్టి భర్త రాజ్‌ కుంద్రా వివాదంలో నిలిచాడు.ఆయన్న పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు.

కోర్టు ఆదేశాలో ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేయడం జరిగింది.గతంలోనే ముంబయిలో బూతు సినిమా లను ఆయన నిర్మిస్తున్నాడు అంటూ ఒక కేసు ఉంది.

 Bollywood Star Heroine Shilpa Shetty Husband Arrested-స్టార్‌ హీరోయిన్‌ భర్త బూతు సినిమాలు చేస్తున్నట్లుగా కేసు నమోదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ కేసు విచారణ నేపథ్యం లో కోర్టు ఆయన్ను దోషిగా నిలబెట్టింది.కోర్టు లో ఆయన్ను దోషిగా గుర్తించడం వల్ల వెంటనే అరెస్ట్ చేయాలని నిర్ణయానికి పోలీసులు వచ్చారు.

అందుకే రాత్రికి రాత్రి ఆయన్ను అరెస్ట్ చేశారు.

Telugu Bollywood News, Heroine Husband Arrest, News In Telugu, Raj Kundra, Shilpa Shetty-Movie

ఇండియాలో బూతు సినిమా ల నిర్మాణం నిషేదం.కాని రాజ్ కుంద్రా మాత్రం నిర్మించాడు అంటూ ఆరోపణలు ఉన్నాయి.ఆ ఆరోపణలు కాస్త నిజం అవ్వడంతో ఆయన్ను అరెస్ట్‌ చేశారు.

రాజ్‌ కుంద్రా వ్యాపారాల విషయంలో కూడా చాలా వరకు విమర్శలు ఎదుర్కొన్నాడు.పెద్ద ఎత్తున ఆయన చేస్తున్న అక్రమాలు బయటకు రావడంతో ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లుగా బాలీవుడ్‌ మీడియా కథనాలు రాస్తోంది.

ఈ విషయమై పలువురు మీడియా వర్గాల వారు మరియు బాలీవుడ్‌ వర్గాల వారు హీరోయిన్‌ శిల్పా శెట్టి ని మాట్లాడించేందుకు ప్రయత్నాలు చేశారు.ఆమె మాత్రం సన్నిహితుల కు కూడా కనిపించకుండా ఉంది.

మీడియా లో వస్తున్న వార్తలకు ఆమె స్పందించాల్సిందే అంటూ కొందరు నెటిజన్స్ డిమాండ్‌ చేస్తున్నారు.మరి భర్త విషయమై శిల్ప ఎందుకు మౌనంగా ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

#HeroineHusband #Raj Kundra #Shilpa Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు