బాలీవుడ్ లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రముఖ హీరోయిన్ “ప్రియాంక చోప్రా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రియాంక చోప్రా కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా హాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించి బాగానే మెప్పించింది.
అయితే ప్రియాంక చోప్రా మొదటగా తెలుగులో ని ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ద్వారా హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా విడుదల కాలేదు.
అయితే నటి ప్రియాంక చోప్రా కేవలం నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా, రచయితగా కూడా బాగానే గుర్తింపు తెచ్చుకుంది.కాగా నటి ప్రియాంక చోప్రా తన కంటే పది సంవత్సరాల చిన్నవాడైన “నిక్ జోనస్” అమెరికన్ సింగర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
కాగా ఈ మధ్య నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.దీంతో తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోల కారణంగా మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఆ ఫోటోలలో ప్రియాంక చోప్రా బికినీ దుస్తులు ధరించి హాట్ హాట్ అందాల ఆరబోతతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోతకి నెటిజన్లు ఫిదా అయ్యారు.
దీంతో ఈ ఫోటోని షేర్ చేసిన ఒక్కరోజులోనే 20 లక్షల పై చిలుకు మంది నెటిజన్లు లైక్ చేశారు.
అలాగే కొందరు ఈ ఫోటో పై స్పందిస్తూ 35 ఏళ్ళ వయసు పైబడినప్పటికీ ప్రియాంక చోప్రా తన వన్నె తరగని అందాలతో మతి పోగొడుతోందంటూ కామెంట్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం పెళ్లయిన తర్వాత ఇలా పెళ్లైన మహిళలు ఇలా తమ ప్రైవేట్ శరీర భాగాలు కనిపించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మరియు వాటిని పబ్లిక్ గా సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి వాటి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే తొలగించాలని కోరుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రియాంక చోప్రా “ది మ్యాట్రిక్స్” అనే అమెరికన్ మూవీలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.అలాగే “టెక్స్ట్ ఫర్ యు” అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా అమెరికాలో జరుగుతున్నట్లు సమాచారం.