రూ.150కే భారీ భవంతి కొనుగోలు చేసిన బాలీవుడ్ టాప్ హీరోయిన్..

ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దుమ్మురేపిన నటీమణి నందా.ఆ రోజుల్లో తను మోస్ట్ పాపులర్ హీరోయిన్.

 Bollywood Star Heroine Nanda Purchased Bungalow For 150 Rupees-TeluguStop.com

సుమారు మూడు దశాబ్దాలకు పైగా తన అద్భుత నటనతో యువకులు మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ.చోటీ బ‌హెన్‌, ధూల్ కా ఫూల్‌, భాభీ, కాలా బ‌జార్‌, కానూన్‌, హ‌మ్ దోనో, జ‌బ్ జ‌బ్ ఫూల్ ఖిలే, గుమ్‌నామ్, ఇత్తేఫ‌ఖ్‌, ద ట్రైన్‌, ప‌రిణీత‌, ప్రేమ్ రోగ్ సహా పలు అద్భుత సినిమాలతో ఆమె అద్భుత నటిగా గుర్తింపు పొందారు.

కేవలం 11 ఏండ్లకే నందా హీరోయిన్ గా మారింది.తొలి సినిమాలోనే 30 ఏండ్ల యువతి పాత్రాల్లో ఆమె అద్భుతంగా నటించి అందరి చేత ప్రశంసలు పొందింది.

 Bollywood Star Heroine Nanda Purchased Bungalow For 150 Rupees-రూ.150కే భారీ భవంతి కొనుగోలు చేసిన బాలీవుడ్ టాప్ హీరోయిన్..-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ పాత్రతోనే తన కెరీర్ కు మంచి పునాది రాళ్లు వేసుకుంది.

ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగించింది నందా.

త‌న 14వ ఏట ఏవీఎం ప్రొడ‌క్ష‌న్స్ బాబీ సినిమాలో బాల వితంతుగా నటించింది.ఆ సినిమా మంచి విజయం సాధించింది.ఈ సినిమా స్వర్ణోత్సవం కూడా జరుపుకుంది.ఈ సినిమా ద్వారా నందా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

మంచి సినిమాలు చేస్తూ దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఏలింది.

తన తొలి సంపాదనతో పలు వస్తువులు కొనుకున్న నందా.

వాటిని తన చివరి శ్వాస వరకూ అపురూపంగా చూసుకుంది.చోటీ బ‌హెన్ సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో తను కారు, బంగళా కొనుగోలు చేసింది.

Telugu Bollywood Heroine, Bollywood Star Heroine Nanda Purchased Bungalow For 150 Rupees, Choti Behan Movie, One Fifty Ruppees Only, Purchased Bungalow, Star Heroine Nanda, Tollywood-Telugu Stop Exclusive Top Stories

అయితే ఆ బంగళాకు అయిన ధర చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.అద్భుత బంగళా కోసం తను ఖర్చు చేసిన మొత్తం 150 రూపాయలు మాత్రమే.అయితే ఆ ఇల్లు ఆమె కొనుగోలు చేసిన సమయం 1950.అయినప్పటికీ అప్పట్లో తక్కువ ధరే అంటున్నారు సినీ జనాలు.అయితే అంత పెద్ద ఇల్లు.అంత తక్కువ ధరకు ఎందుకు అమ్మారు? అనే ప్రశ్న అప్పట్లో తలెత్తింది.అయితే ఆ బంగ్లాను అప్పట్లో చాలా మంది భూత్ బంగ్లా అనేవారట.అందుకే దాన్ని వదిలించుకోవాలనుకున్నారట యజమానులు.ఎంత వచ్చినా చాలు అనుకున్నారట.అందుకే చౌక ధరకు నందా ఆ భవనాన్ని దక్కించుకుందట.అయితే తను చనిపోయేంత వరకు ఆమె అదే నివాసంలో ఉన్నది.2014లో తను చనిపోయింది.

#BollywoodStar #OneFifty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు