మహేష్ తో మళ్ళీ వర్క్ చెయ్యాలనుంది.. బాలీవుడ్ హీరోయిన్?

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.ఎన్నో సినిమాలలో నటించినా మహేష్ కొన్ని సక్సెస్ లే కాకుండా.కొన్ని ప్లాఫ్ లను కూడా ఎదుర్కొన్నాడు.చాలా వరకు ఈయన నటించిన సినిమాలు మంచి కథ నేపథ్యంలో ఉంటాయి కానీ అవి అంత విజయాన్ని అందుకోలేదు.ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన 1-నేనొక్కడినే సినిమాలో నటించగా అది అంత సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.కానీ కొంతవరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Bollywood Star Heroine Kriti Sanon Wants To Act With Mahesh Babu-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నటి కృతి సనన్.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచిన కృతి సనన్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయము కాగా ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు అందుకుంది.

 Bollywood Star Heroine Kriti Sanon Wants To Act With Mahesh Babu-మహేష్ తో మళ్ళీ వర్క్ చెయ్యాలనుంది.. బాలీవుడ్ హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో దూసుకుపోతుంది.అంతేకాకుండా ప్రభాస్ సరసన కూడా అవకాశం అందుకుంది.ఈ బ్యూటీకి మహేష్ బాబుతో మళ్లీ వర్క్ చేయాలని ఉందట.

Telugu Bollywood, Kriti Sanon, Mahesh Babu, One Nenokkadine-Telugu Gossips

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను పంచుకోవడమే కాకుండా అప్పుడప్పుడు అభిమానులతో కాసేపు ముచ్చటిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్స్టా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించిన ఈ బ్యూటీ అందులో తనని ఏదైనా ప్రశ్న వేయమని అభిమానులను కోరింది.

Telugu Bollywood, Kriti Sanon, Mahesh Babu, One Nenokkadine-Telugu Gossips

దీంతో ఓ నెటిజన్ మహేష్ బాబు గురించి ఒక్క పదంలో చెప్పమని కోరగా మహేష్ బెస్ట్ అని, చాలా హంబుల్ గా ఉంటారని అతనితో వర్క్ అమేజింగ్ గా ఉంటుందని తెలిపింది.అంతే కాకుండా మరో సారి మహేష్ తో నటించాలని ఉందని తన మనసులో మాటలను బయటకు తెలిపింది ఈ బ్యూటీ.ఇక చివరి లో ఒక పదంలో కాకుండా 19 పదాలలో చెప్పినందుకు క్షమాపణలు తెలిపింది.దీంతో నెటి జనులంతా మహేష్ తర్వాత తీసే సినిమాలో అవకాశాన్ని అందుకుంటారులేనని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ లో నటిస్తుంది.

#Mahesh Babu #Kriti Sanon #One Nenokkadine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు