ఆరో నెల నా జీవితానికి మలుపు.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు..?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కియారా అద్వానీ పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.వినయ విధేయ రామ సినిమా తరువాత కియారా అద్వానీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

 Bollywood Star Heroine Kiara Adwani Feels June Month Was Lucky Month-TeluguStop.com

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కుతున్న రెండు ప్రాజెక్ట్ లలో కియారా అద్వానీ హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.కియారా సైతం సౌత్ ఇండియా సినిమాలో నటించబోతున్నట్టు చెప్పినా ఏ సినిమా అనే విషయం చెప్పడం లేదు.

తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఆరో నెల నా జీవితానికి మలుపు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.కియారా ఈ విధంగా కామెంట్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది.

 Bollywood Star Heroine Kiara Adwani Feels June Month Was Lucky Month-ఆరో నెల నా జీవితానికి మలుపు.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్ సినిమా రెండేళ్ల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలో జూన్ నెలలో విడుదలై సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.జూన్ 21వ తేదీన కబీర్ సింగ్ రిలీజ్ కాగా ఆరో నెల జూన్ లో తను నటించిన సినిమా సక్సెస్ కావడంపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జూన్ నెల తనకు లక్కీ నెల అని కియారా పేర్కొన్నారు.

Telugu Arjun Reddy Remake, June Month, Kabeer Singh, Kiara Advani, Kiara Adwani, Kiara Remuneration, Kiara Viral Comments, Lucky Month-Movie

జూన్ నెల అంటే తనకు అంతా కలిసొస్తుందని కియారా అద్వానీ చెప్పుకొచ్చారు.కియారా అద్వానీ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.కబీర్ సింగ్ సక్సెస్ తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కియారా అద్వానీకి ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కియారా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Telugu Arjun Reddy Remake, June Month, Kabeer Singh, Kiara Advani, Kiara Adwani, Kiara Remuneration, Kiara Viral Comments, Lucky Month-Movie

ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాకు 3కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.భాషా భేదం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తే కియారా అద్వానీ ఆ ఆఫర్లను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.

#Lucky Month #Kiara Advani #Kiara Adwani #KiaraViral #Kabeer Singh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు