మళ్ళీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్…  

Kareena kapoor, Bollywood star heroine, Pregnancy, Bollywood, Saif ali khan - Telugu Bollywood, Bollywood Star Heroine, Kareena Kapoor, Pregnancy, Saif Ali Khan

బాలీవుడ్లో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే కరీనా కపూర్ 2012వ సంవత్సరంలో బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన  స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - Bollywood Star Heroine Kareena Kapoor Reveals About Her Pregnancy

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే తాజాగా కరీనా కపూర్ తాను మరో బిడ్డకు జన్మ నివ్వబోతున్నట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది.ఇందులో భాగంగా తన కుటుంబంలోకి మరొకరిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం అంటూ పేర్కొంది.

TeluguStop.com - మళ్ళీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పటికే కరీనాకపూర్ 2016 సంవత్సరంలో తైమూర్ అలీ ఖాన్ అనే బుడతడి కి జన్మనిచ్చింది.పుట్టడంతోనే స్టార్ కిడ్ అయినటువంటి తైమూర్ అలీ ఖాన్ కి సోషల్ మీడియా మాధ్యమాలలో ఫాలోయింగ్ బాగానే ఉంది.

దీంతో పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ కరీనా కపూర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రు.

కాగా  కరీనా కపూర్ ఇటీవలే అంగ్రేజీ మీడియం అనే చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అయితే ప్రస్తుతం కరీనా కపూర్ “లాల్ సింగ్ చద్దా” అనే చిత్రంలో హీరోయిన్ గా  నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పనులు పూర్తయినట్లు సమాచారం.దీంతో ఈ చిత్రాన్ని నవంబర్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

#Saif Ali Khan #Pregnancy #Kareena Kapoor #BollywoodStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Star Heroine Kareena Kapoor Reveals About Her Pregnancy Related Telugu News,Photos/Pics,Images..