ఆ డైరెక్టర్ అలాంటి వాడు కాదని అంటున్న స్టార్ హీరోయిన్…  

Bollywood star heroine Huma Qureshi support to anurag kashyap for casting couch allegations, Huma Qureshi, Bollywood star heroine, Casting Couch issue, Anurag kashyap, Bollywood, - Telugu Anurag Kashyap, Bollywood, Bollywood Star Heroine, Bollywood Star Heroine Huma Qureshi Support To Anurag Kashyap For Casting Couch Allegations, Casting Couch Issue, Huma Qureshi

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో నిన్నమొన్నటి వరకు డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు కలకలం సృష్టిస్తే ప్రస్తుతం సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య తీవ్ర దుమారం రేపుతోంది.దీనికి తోడు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి మీటూ ఉద్యమంపై అవగాహన పెరగడంతో కొందరు నటీనటులు తాము ఎదుర్కున్న లైంగిక వేధింపులను గురించి ధైర్యంగా సోషల్ మీడియా మాధ్యమాలలో ముందుకు వచ్చి చెబుతున్నారు.

TeluguStop.com - Bollywood Star Heroine Huma Qureshi Support To Anurag Kashyap For Casting Couch Allegations

ఈ క్రమంలో ఇటీవలే తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించిన బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ తనని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.దీంతో ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఈ మీటూ ఉద్యమం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

అయితే పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై చేసినటువంటి ఈ లైంగిక ఆరోపణలు మాత్రం కొందరు బాలీవుడ్ నటులు ఖండిస్తున్నారు.ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించింది.

TeluguStop.com - ఆ డైరెక్టర్ అలాంటి వాడు కాదని అంటున్న స్టార్ హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో అనురాగ్ కశ్యప్ తాను గతంలో పలు చిత్రాల్లో కలిసి పని చేశామని తనకి అతడి నుంచి ఎలాంటి వేధింపులు ఎదురు కాలేదని అలాగే అనురాగ్ కశ్యప్ ఇతర నటీనటులు కూడా వేధించడం తాను ఎప్పుడూ చూడలేదు, వినలేదని కూడా తెలిపింది.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో కొందరు ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఇది సరికాదని, నిజంగా మీరు సమస్యలు ఎదుర్కొని ఉంటే పోలీసులకి ఫిర్యాదు చేయాలని అంతేతప్ప ఇలా సోషల్ మీడియా మాధ్యమాలలో రచ్చ చేయడం వల్ల ఉపయోగం ఉండదని స్పష్టం చేసింది.

కాగా ఈ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న అనురాగ్ కశ్యప్ కి ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ నటి మోడల్ మందాన కరిమి కూడా తన మద్దతు తెలియజేసింది.అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ మద్దతును తెలియజేస్తున్నారు.

దీంతో పాయల్ పై ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువయ్యాయి.దీంతో ఈ విషయంపై స్పందించిన  కొందరు నెటిజన్లు ఈమధ్య కాలంలో కొందరు నటీనటులు పాపులర్ కావాలనే ఉద్దేశంతో సినిమా పరిశ్రమలోని ప్రముఖ సెలబ్రిటీల పై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల ను కోరుతున్నారు.

#Huma Qureshi #CastingCouch #Anurag Kashyap #BollywoodStar #BollywoodStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Star Heroine Huma Qureshi Support To Anurag Kashyap For Casting Couch Allegations Related Telugu News,Photos/Pics,Images..