ఆ హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకుంటే విడి పోతారట...

మామూలుగా ఎక్కడైనా, ఎవరైనా పెళ్లిళ్లు చేయాలంటే వధూవరుల జాతకాలను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించి ఇద్దరి జాతకాలు అన్ని విషయాల్లోనూ కలుస్తున్నాయా లేదా, లేక జాతకాల్లో ఏదైనా లోపం ఉందా అనే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు.అయితే తాజాగా ఓ జ్యోతిష్కుడు బాలీవుడ్ కి చెందినటువంటి ఓ స్టార్ హీరో మరియు స్టార్ హీరోయిన్ల పెళ్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Alia Bhatt, Bollywood Star Heroine, Ranbir Kapoor, Marriage Prediction,  Social-TeluguStop.com

వివరాల్లోకి వెళితే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు గ్లామర్ డాల్ అలియా భట్ గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్  పరిశ్రమలో బలంగా వినిపిస్తున్నాయి.దీంతో తాజాగా ఓ ప్రముఖ జ్యోతిష్కుడు వీరిద్దరి వివాహంపై స్పందించాడు.

అంతేగాక ఈ ఇద్దరి పేర్లను బట్టి జాతకాలు చూడగా, రణబీర్ కపూర్ మరియు అలియా భట్ ఇద్దరు పెళ్లి చేసుకుంటే తమ సినీ జీవితం చాలా బాగుంటుందని, కానీ వీళ్ళిద్దరికీ పెళ్లయిన కొంతకాలానికే మనస్పర్థలు, విభేదాలు వచ్చి విడిపోతారని, తమ జాతకంలో రాసి ఉందని చెప్పుకొచ్చాడు./br>

దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగానే దుమారం రేపుతున్నాయి.

అయితే ఈ విషయంపై నెటిజన్ల మాత్రం బాగానే ట్రోల్ చేస్తున్నారు.అంతేగాక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలంటే జాతకాలు కలవాల్సిన అవసరం లేదని తమ మనసులు కలిస్తే చాలని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అలియా భట్ తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆర్.ఆర్.ఆర్ అనే చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే పలు బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించడానికి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube