క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో.... ఎందుకంటే...?

అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన దూరదర్శన్ ఛానల్లో ప్రసారమైన శక్తి మాన్ ధారావాహికలో  సాహసవీరుడు శక్తి మాన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ముఖేష్ ఖన్నా బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

 Bollywood Star Hero Mukesh Khanna Said Apology Through Twitter, Mukhesh Khanna,-TeluguStop.com

అంతేగాక పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.అయితే ఇటీవలే మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపుల  విషయంపై ముఖేష్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా మాధ్యమాలలో పలువురు సినీ సెలబ్రిటీల ఆగ్రహానికి గురయ్యాడు.

దీంతో తాజాగా మరోమారు ఈ విషయంపై ముఖేష్ ఖన్నా స్పందిస్తూ  తాను ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు లేదా విమర్శలు చేయలేదని, ఒకవేళ తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే తనను క్షమించాలని పేర్కొన్నాడు.దీంతో ప్రస్తుతం ముఖేష్ ఖన్నా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా గతంలో ముఖేష్ ఖన్నా మహిళలు బయట తిరగడం వల్లే వారిపై అఘాయిత్యాలు, ఆకృత్యాలు జరుగుతున్నాయని కాబట్టి ఇంటి పట్టునే ఉండాలంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు.

దీంతో కొందరు సినీ సెలబ్రిటీలు ఈ విషయం పై బాగానే రియాక్ట్ అయ్యారు.

మరికొంతమంది అయితే ఏకంగా ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉండటం వల్లే మన సమాజం ఇలా తయారైందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దాంతో ముఖేష్ ఖన్నా ఈ విషయంపై స్పందిస్తూ క్షమాపణలు చెప్పడంతో కొంతమేర వివాదం సద్దుమణిగినట్టు కనిపిస్తుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా బాలీవుడ్ లో ముఖేష్ ఖన్నా దాదాపుగా 30 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు. అలాగే బుల్లితెరలో కూడా దాదాపుగా 10 కి పైగా ధారావాహికలలో నటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube