అల్లరి నరేష్ హీరో కావడానికి అతనే కారణం.. ఆ ఒక్క మాటతో జీవితమే మార్పు?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి కామెడీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన తండ్రి ఎవరో కాదు తెలుగు సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ.

 Bollywood Star Hero Amitab Bachchan Is Reason Behind Allari Naresh Becoming Hero-TeluguStop.com

ఈయన దర్శకుడిగా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయనకు అల్లరి నరేష్ కాకుండా ఆర్యన్ రాజేష్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

వీరిద్దరిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ఇక ఈవీవీ 2011లో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

 Bollywood Star Hero Amitab Bachchan Is Reason Behind Allari Naresh Becoming Hero-అల్లరి నరేష్ హీరో కావడానికి అతనే కారణం.. ఆ ఒక్క మాటతో జీవితమే మార్పు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే అల్లరి నరేష్ ఇప్పుడు ఇలా కావడానికి కారణం అమితాబచ్చన్ అని తెలిసింది.

తొలిసారిగా అల్లరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నరేష్.

ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి గుర్తింపు తెచ్చుకోగా ఈ సినిమా పేరునే తన ఇంటి పేరుగా జోడించి అల్లరి నరేష్ గా పేరు సంపాదించుకున్నాడు.ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లరి అనే పేరును మాత్రం తన పేరు నుండి విడదీయలేదు.

ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులకు మంచి అభిమాన హీరో గా మారాడు.

ఈయన నటించిన కితకితలు, అల్లరే అల్లరి, సిద్దు ఫ్రం శ్రీకాకుళం, సీమటపాకాయ్, లడ్డు బాబు ఇలా ఎన్నో హాస్య పరమైన సినిమాలలో నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.

ఇక ఈ మధ్య సీరియస్ పాత్రలో కూడా నటిస్తున్నాడు అల్లరినరేష్.ఈ ఏడాది నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇందులో సీరియస్ పాత్రలో కూడా బాగా సెట్ అయ్యాడని ప్రశంసల వర్షం కురిపించారు ప్రేక్షకులు.

అంతేకాకుండా మహేష్ బాబు నటించిన సినిమాలో మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కూడా సీరియస్ పాత్రలో నటించాడు.

Telugu Allari Movie, Allari Naresh, Allari Naresh Becoming Hero, Allari Naresh Success Story, Amitab Bachchan Praises Allari Naresh, Bollywood Star Hero Amitab Bachchan, Comedy Movies, Comiden, Evv Satyanaraya Son, Hero, Tollywood-Movie

ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే ఈ రోజు తాను హీరోగా ఇంత గొప్ప స్థాయిలో నిలవడానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ అని తెలిసింది.హీరోగా అడుగు పెట్టక ముందు అల్లరి నరేష్ తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్ గా పని చేసేవాడట.

అంతే కాకుండా తన తండ్రి చాలా సార్లు అన్నయ్య హీరో అవ్వాలని, తనను మంచి దర్శకుడు కావాలని అన్నాడట.

కానీ నరేష్ కు మాత్రం హీరో అవ్వాలని చాలా ఆసక్తి ఉండేదట.

కానీ తన తండ్రి దగ్గరికి వెళ్లి చెప్పే అంత ధైర్యం లేక పోయేసరికి.హీరోలు చెప్పిన డైలాగ్స్ ని ఇంట్లోనే బాగా ప్రాక్టీస్ చేసేవాడట.

ఇక ఈవీవీ గతంలో చాలా బాగుంది అనే సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా 100 రోజుల వేడుకను ఘనంగా జరిపారు.అందులో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలిసింది.

ఇంతకీ ఈ వేడుకలో బిగ్ బీ హాజరు కావడానికి మరో కారణం కూడా ఉంది.

Telugu Allari Movie, Allari Naresh, Allari Naresh Becoming Hero, Allari Naresh Success Story, Amitab Bachchan Praises Allari Naresh, Bollywood Star Hero Amitab Bachchan, Comedy Movies, Comiden, Evv Satyanaraya Son, Hero, Tollywood-Movie

ఆ సమయంలో ఈవీవీ సత్యనారాయణ బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో సూర్యవంశ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడని అందుకే అమితాబ్ బచ్చన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు అని తెలిసింది.ఇక చాలా బాగుంది సినిమాకు అల్లరి నరేష్ క్యాషియర్ గా పని చేశాడట.క్యాషియర్ గా నరేష్ ఫీల్డ్ తీసుకుంటుండగా.

నరేష్.ఈవీవీ సత్యనారాయణ అబ్బాయి అని అమితాబ్ బచ్చన్ కు తెలియడంతో.

వెంటనే ఈవీవీ తో మా అబ్బాయి లాగా మీ అబ్బాయి కూడా చాలా పొడుగ్గా ఉన్నాడు.హీరోగా పనికొస్తాడు అని చెప్పడంతో.

వెంటనే నరేష్ తన తండ్రికి హీరోగా కావాలని ఉందని చెప్పాడట.దాంతో తన తండ్రి హీరోగా నటించడానికి ఒప్పుకోవడంతో అలా ఇప్పటివరకు మంచి హీరోగా నిలిచి మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు అల్లరి నరేష్.

దీంతో అమితాబచ్చన్ ఆ రోజు చెప్పిన మాటల వల్లే ఇప్పుడు తను హీరోగా ఎదిగాడు.

#Allari Naresh #AllariNaresh #Allari Naresh #Evv Satyanaraya #BollywoodAmitab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు