మళ్ళీ భారీ విరాళాన్ని ప్రకటించిన అక్షయ్…. ఈసారి ఎంతంటే….  

Akshay Kumar Donations Covid Ppe Bollywood Covid 19 3 Crore - Telugu 3 Crore, Akshay Kumar, Bollywood, Covid, Covid-19, Donations, Ppe

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కారణంగా ఈ వైరస్ మహమ్మారిని తరిమికొట్టాలని దేశంలోని పలువురు సెలబ్రిటీలు మరియు సినీ ప్రముఖులు అందరూ తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.అయితే ఇందులో భాగంగా ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ కరోనా వైరస్ కారణంగా నిరాశ్రయులైన మరియు బాధితులకు సాయం చేసేందుకు గాను దాదాపుగా 25 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

 Akshay Kumar Donations Covid Ppe Bollywood Covid 19 3 Crore

అయితే తాజాగా అక్షయ్ కుమార్ మరో భారీ విరాళాన్ని మున్సిపల్ కార్మికుల కోసం ప్రకటించారు.ఇందులో భాగంగా దాదాపుగా మూడు కోట్ల రూపాయలను మున్సిపల్ కార్మికులకు అవసరమైనటువంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ కిట్స్ కోసం అందజేస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.

అక్షయ్ కుమార్ చేసినటువంటి ఈ పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక అక్షయ్ కుమార్ నిజమైన రియల్ లైఫ్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే ఇప్పటివరకు అక్షయ్ కుమార్ దాదాపు 28 కోట్ల రూపాయలు ఈ కరోనా వైరస్ కోసం విరాళంగా ఇచ్చాడు.

మళ్ళీ భారీ విరాళాన్ని ప్రకటించిన అక్షయ్…. ఈసారి ఎంతంటే….-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్, పృథ్వీరాజ్, అత్రాంగి రే, అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

అయితే సూర్య వంశి అనే చిత్రంలో కూడా అక్షయ్ కుమార్ నటించగా ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Star Hero Akshay Kumar Donated 3 Crore Rupees To Ppe Equipment Related Telugu News,Photos/Pics,Images..