కరోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డ బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్!!  

ప్ర‌పంచ‌దేశాల‌కు కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌.అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

TeluguStop.com - Bollywood Star Hero Abhishek Bachchan Tested Corona Negative

చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.

సామాన్యుల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు, సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు.

TeluguStop.com - కరోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డ బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఇటీవ‌ల బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా మ‌హ‌మ్మారి బారిన పడిన సంగ‌తి తెలిసిందే.

జులై 11న అమితాబ్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది.అయితే వీరిలో ఇప్ప‌టికే ఐశ్వర్యరాయ్, ఆరాధ్య మ‌రియు అమితాబ్ బచ్చన్ క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక తాజాగా అభిషేక్ బచ్చన్ కూడా క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.ఈ విషయాన్ని స్వ‌యంగా ఆయనే సోషల్ మీడియా వేధిక‌గా వెల్లడించారు.ఈ సంద‌ర్భంగా అభిషేక్.`మాటంటే మాటే! ఈ మధ్యాహ్నం నాకు కరోనా టెస్టు చేయగా నెగెటివ్ అని వచ్చింది.ఈ వైరస్ ను జయిస్తానని మీకు ముందే చెప్పాను.

నాకోసం, నా కుటుంబం క్షేమం కోసం ప్రార్థనలు చేసినవారందరికీ కృతజ్ఞతలు.

నానావతి ఆసుపత్రిలో చికిత్స అందించిన డాక్టర్లకు, నర్సులకు, వైద్య సిబ్బంది అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను.థాంక్యూ!` అంటూ ట్విట్ట‌ర్ వేధిక‌గా పేర్కొన్నారు.

కాగా, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తం క‌రోనాను జ‌యించ‌డంతో.అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

#COVID-19 #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Star Hero Abhishek Bachchan Tested Corona Negative Related Telugu News,Photos/Pics,Images..