మహా భారతం మీద ద్రుష్టి పెట్టిన ఆ బాలీవుడ్ దర్శకుడు  

మహాభారత్ టైటిల్ ని రిజిస్టర్ చేయించిన బాలీవుడ్ దర్శకుడు. .

Bollywood Star Director Plan To Workout Mahabharat Movie-

మహా భారతం… ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులని విశేషంగా ఆకట్టుకుంటుంది.ఇక ఈ మహాభారత కథతో చాలా మంది సినీ ప్రముఖులు భారీ బడ్జెట్, భారీ తారాగణంతో సినిమాని తెరకెక్కించాలి అనే ప్రయత్నంలో ఉన్నారు.ఇప్పటికే మోహన్ లాల్ మహాభారత్ కథని తెరపైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసిన మరల దర్శకుడు, నిర్మాతకి మధ్య ఏవో అభిప్రాయ బేదాల వలన తెరపైకి వెళ్ళలేదు.ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ఎప్పటి నుంచో మహాభారతం సినిమా తీయాలనే ప్రయత్నం చేస్తున్నారు..

Bollywood Star Director Plan To Workout Mahabharat Movie--Bollywood Star Director Plan To Workout Mahabharat Movie-

మరో వైపు టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి కూడా తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం అని ఎప్పుడో చెప్పాడు.

ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.దీని తర్వాత సూపర్ స్టార్ మహేశ్ భాబుతో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ మేకర్ రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్ర మహా భారతం టైటిల్ ని రిజిస్టర్ చేయించుకున్నారు.రాంగ్ దె బసంతి, బాగ్ మిల్కా బాగ్ లాంటి సూపర్ సినిమాలు తీసిన ఈ దర్శకుడు ఇప్పుడు మహా భారత్ టైటిల్ రిజిస్టర్ చేయించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.మరి రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ అని చెబుతున్న ఈ సినిమాని అతనికంటే ముందుగా రాకేశ్ తెరకెక్కించడానికి రెడీ కావడం చూస్తుంటే బాలీవుడ్ మహా భారతం ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అర్ధమవుతుంది.