భర్త అరెస్ట్ తో ఈ హీరోయిన్ కెరియర్ చిక్కుల్లో పడినట్లేనా....?

తెలుగులో అప్పట్లో టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “సాహస వీరుడు సాగర కన్య” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి “శిల్పా శెట్టి” గురించి తెలియని వారుండరు.ప్రస్తుతం ఈ అమ్మడికి దాదాపుగా 40 సంవత్సరాలు వయసు పైబడినప్పటికీ ఇప్పటికీ చాలా యంగ్ గా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తూ తను వన్నె తరగని అందంతో కుర్రకారు మతి పోగొడుతోంది.

 Bollywood Star Actress Shilpa Shetty Cine Career In Struggles After Her Husband Arrest-TeluguStop.com

కాగా నటి శిల్పాశెట్టి బాలీవుడ్ లో సీనియర్ నుంచి జూనియర్ వరకు దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి బాగానే అలరించింది.దీంతో శిల్పా శెట్టి రెమ్యూనరేషన్ కూడా దాదాపుగా మూడు నుంచి ఆరు కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

అంతేకాకుండా ఈ అమ్మడికి పలు ప్రముఖ సంస్థలలో పెట్టుబడులు కూడా ఉన్నాయి.దీనికితోడు శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యాపారవేత్త కావడంతో వందల కోట్ల రూపాయలను సంపాదించింది.

 Bollywood Star Actress Shilpa Shetty Cine Career In Struggles After Her Husband Arrest-భర్త అరెస్ట్ తో ఈ హీరోయిన్ కెరియర్ చిక్కుల్లో పడినట్లేనా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇటీవలే అశ్లీల చిత్రాల చిత్రీకరణ వ్యవహారంలో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ను పోలీసులు అరెస్టు చేశారు.అంతేకాకుండా వివిధ కోణాలలో విచారిస్తూ రిమాండ్ కి తరలించారు.దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.అంతేకాకుండా రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల చిత్రీకరణ వ్యవహారంలో అరెస్టయినప్పటినుంచి రాజ్ కుంద్రా సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను కొన్ని ప్రముఖ సంస్థలు రద్దు చేసుకుంటున్నారట.

అంతేకాకుండా రాజ్ కుంద్రా విధులు నిర్వహిస్తున్న సంస్థల నుంచి కూడా ఉద్వాసన కలిగినట్లు సమాచారం.దీంతో వ్యాపార పరంగా రాజ్ కుంద్రా కి దాదాపుగా వంద కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని కొందరు చర్చించుకుంటున్నారు.

అయితే రాజ్ కుంద్రా అరెస్టు ప్రభావం హీరోయిన్ శిల్పా శెట్టి సినీ కెరీర్ పై కూడా పడినట్లు సమాచారం.కాగా ప్రస్తుతం శిల్పా శెట్టి ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.

కానీ తన భర్త అరెస్టు కారణంగా తమ చిత్రం నుంచి శిల్పా శెట్టిని తొలగించినట్లు బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.దీనికితోడు ఈ మధ్య పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కూడా రాజ్ కుంద్రా వ్యవహారంపై నెగిటివ్ వ్యాఖ్యలు చేయడంతో రోజు రోజుకి ఈ వ్యవహారం మరింత ముదురుతోంది.

దీంతో ప్రస్తుతం రాజ్ కుంద్రా లైఫ్ తో పాటూ శిల్పా శేట్టి సినీ కెరియర్ కూడా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

#ShilpaShetty #Shilpa Shetty #Raj Kundra #Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు