ఈ హీరోయిన్ తన భర్తతో విడిపోయింది.. కానీ విడాకులు మాత్రం ఇవ్వలేదట....

బాలీవుడ్ లో ఒకప్పుడు పలువురు స్టార్ హీరోల సరసన నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బాలీవుడ్ ప్రముఖ వెటరన్ సీనియర్ హీరోయిన్ “డింపుల్ కపాడియా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి డింపుల్ కపాడియా అప్పట్లో బాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా రాణిస్తున్న “రాజేష్ ఖన్నా” అనే స్టార్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 Bollywood Star Actress Dimple Kapadia And Rajesh Khanna Divorce-TeluguStop.com

పెళ్లయిన కొత్తలో వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు.ఇందుకు చిహ్నంగా వీరిద్దరికీ ట్వింకిల్ ఖన్నా, రింకు ఖన్నా అనే ఇద్దరు కూతుళ్లు కూడా జన్మించారు.

కానీ ఏమైందోఏమోగాని కొంతకాలానికే ఈ ఇద్దరిమధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో విడిపోయారు.ఆ తర్వాత రాజేష్ ఖన్నా తన పిల్లల సంరక్షణ కూడా భార్య డింపుల్ కపాడియాకే అప్పగించాడు.

 Bollywood Star Actress Dimple Kapadia And Rajesh Khanna Divorce-ఈ హీరోయిన్ తన భర్తతో విడిపోయింది.. కానీ విడాకులు మాత్రం ఇవ్వలేదట….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ రాజేష్ ఖన్నా నుంచి విడిపోయినప్పటికీ డింపుల్ కపాడియా మాత్రం అతడికి విడాకులు ఇవ్వలేదు.దీంతో వీరిద్దరూ ప్రస్తుతానికి వేర్వేరుగా ఉన్నప్పటికీ అధికారికంగా మాత్రం విడాకులు మంజూరు కాలేదు.

కాగా అప్పట్లో డింపుల్ కపాడియా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో ప్రేమలో పడిందని కానీ ఆ దర్శకుడు డింపుల్ కపాడియాని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోపాటూ అప్పటికే ఆ దర్శకుడికి వేరే మహిళతో పెళ్ళి జరగడంతో వీరిద్దరి మధ్య బంధం చాలా సీక్రెట్ గా ఉన్నట్లు పలు కథనాలు బలంగా వినిపించాయి.దీనికితోడు డింపుల్ కపాడియా ప్రియుడు తన భార్య కి విడాకులు ఇచ్చేందుకు నిరాకరించడంవల్ల వీరిద్దరూ పెళ్లి బంధానికి దూరమయ్యారని పలు గుసగుసలు వినిపించాయి.

దాంతో ఇప్పటివరకు డింపుల్ కపాడియా మాత్రం తన భర్త రాజేష్ ఖన్నాకి మాత్రం విడాకులు ఇవ్వలేదు.

Telugu Akshaya Kumar, Bollywood, Bollywood Star Actress, Bollywood Star Actress Dimple Kapadia And Rajesh Khanna Divorce, Dimple Kapadia, Dimple Kapadia And Rajesh Khanna Divorce, Rajesh Khanna, Twinkle Khanna-Movie

కాగా ప్రస్తుతం డింపుల్ కపాడియా కూతురు ట్వింకిల్ ఖన్నా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా రాణిస్తున్న ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ని పెళ్లాడింది.ప్రస్తుతం వీరిద్దరూ ఎంతో మంది యువ నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.ఏదేమైనప్పటికీ పెళ్లయిన తర్వాత డింపుల్ కపాడియా తన ప్రేమబంధం కారణంగానే తన భర్తకు విడాకులు ఇవ్వకుండా దూరంగా ఉంటోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఇటీవలే డింపుల్ కపాడియా బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన “తాండవ్” అనే వెబ్ సిరీస్ లో నటించింది.ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

#BollywoodStar #Rajesh Khanna #Akshaya Kumar #BollywoodStar #DimpleKapadia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు