ఈ హీరోయిన్ తల్లి కాబోతోందని ప్రభాస్ సినిమా నుంచి తప్పించారంటూ...

తెలుగులో ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ “ప్రభాస్” వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.అంతేగాక ఆ మధ్య బాహుబలి, సాహొ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించడంతో ప్రస్తుతం ప్రభాస్ మార్కెట్ దేశవ్యాప్తంగా బాగా పెరిగి పోయింది.

 Bollywood Star Actress Deepika Padukone Pregnant News Viral-TeluguStop.com

దీంతో దర్శక నిర్మాతలు కూడా వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.కాగా ప్రస్తుతం ప్రభాస్ మహానటి మూవీ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

కాగా ఇటీవల ఈ చిత్రానికి “ప్రాజెక్ట్ కే” అనే టైటిల్ ని ఖరారు చేసే పనిలో పడినట్లు సమాచారం.కాగా ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ “దీపికా పదుకొనే” హీరోయిన్ గా నటిస్తోంది.

 Bollywood Star Actress Deepika Padukone Pregnant News Viral-ఈ హీరోయిన్ తల్లి కాబోతోందని ప్రభాస్ సినిమా నుంచి తప్పించారంటూ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటన కూడా చేశారు.

అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఇటీవలే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే తల్లి కాబోతోందని దాంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రం నుంచి దీపికా ని తొలగించినట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అంతేకాక దీపికా పదుకునే స్థానంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ హీరోయిన్ పేరును పరిశీలిస్తున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

కానీ ఇప్పటివరకు హీరోయిన్ దీపికా పదుకొనే మాత్రం తన ప్రెగ్నెన్సీ గురించి స్పందించలేదు.దీంతో ప్రాజెక్ట్.కే చిత్రం నుంచి తనని తొలగించినట్లు వినిపిస్తున్న వార్తల్లో నిజమెంతో ఇంకా తెలియాల్సి ఉంది.

-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా దీపిక పదుకొనే 2018 సంవత్సరంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో “రణవీర్ సింగ్” ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లయినప్పటి నుంచి దీపికా పదుకొనే సినిమాల పరంగా కొంతమేర జోరు తగ్గించింది.కాగా ప్రస్తుతం దీపికా పదుకొనే బాలీవుడ్ లో 83, సర్కస్, పటాన్, షకున్ బత్రా తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు