సింగర్ కి సోకిన కరోనా వైరస్.... విషాదంలో.. 

2015 సంవత్సరంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా నటించినటువంటి “దిల్ వాలే” చిత్రంలో ను “ప్రేమిక”, “టుకుర్,టుకుర్” అనే పాటలు ఇప్పటికీ ప్రేక్షకులకు బాగానే గుర్తుంటాయి.అయితే ఈ పాటలు పాడినటువంటి ప్రముఖ గాయని కనికా కపూర్  ప్రస్తుతం కరోనా వైరస్ లక్షణాలు సోకి బాధపడుతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 Bollywood Singer Kanika Kapoor Suffering From Corona Virus-TeluguStop.com

అయితే ఈ విషయాల పై స్పందించినటువంటి కనికా కపూర్ తన అధికారిక సోషల్ ఖాతా ద్వారా తనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ చేసింది.

దీంతో కనికా కపూర్ అభిమానులు ఆమె ఈ వైరస్ నుంచి తొందరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

అయితే కనికా కపూర్ ఈ వైరస్ లక్షణాలను గురించి వివరిస్తూ మరో పోస్టులు కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇందులో భాగంగా తనకు ఇటీవలే ఫ్లూ లక్షణాలు సోకినట్లు అనుమానం వచ్చిందని అందువల్ల వైద్యుల్ని సంప్రదించగా తనకు కరోనా వైరస్ సోకిన వైద్యులు నిర్ధారణ చేశారని చెప్పుకొచ్చింది.

అంతేగాక ప్రతి ఒక్కరూ ఈ వైరస్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించింది.ఒకవేళ ఈ వైరస్ సోకినట్లు అనుమానం వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించి నిర్ధారణ చేసుకొని ఈ వైరస్ నుంచి కోలుకోవడానికి తీసుకునే చర్యలను క్రమం తప్పకుండా పాటించాలని సూచించింది.

Telugu Bollywood, Bollywoodkanika, Kanika Kapoor, Kanikakapoor-Movie

అయితే ఈ విషయం ఎలా ఉండగా ఇప్పటికే ఈ క్రమంలో కరోనా వైరస్ కి భయపడి బాలీవుడ్ సినీ పరిశ్రమలోని పలువురు భారీ బడ్జెట్ చిత్రాల చిత్రీకరణ కూడా నిలిపివేశారు.అంతేగాక జన సాంద్రత ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాలను కూడా మూసివేశారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలో వైరస్ ని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడ ఈ కేసులు కనిపిస్తూనే ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube