కరోనా సెకండ్ వేవ్ తో బాలీవుడ్ కి 4000 కోట్ల నష్టం వస్తుందంట

గత ఏడాది మొదటి సారి కరోనా వచ్చినప్పుడు వెంటనే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టడంతో భారీగా కేసులు నమోదు కాలేదు.అయితే వాణిజ్య, వ్యాపారాలు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి.

 Bollywood Set For 4,000 Crore Loss In 2021, Tollywood, Indian Cinema, B-town, Ra-TeluguStop.com

దీంతో కొన్ని లక్షల కోట్ల ఆదాయానికి గండి పడింది.లాక్ డౌన్ నిర్ణయం సరైనదే అయినా ఏకంగా ఆరు నెలల కాలం పాటు పూర్తిగా వ్యాపారాలు మూతపడ్డాయి.

ఇక సినిమా పరిశ్రమకి కోలుకోలేని దెబ్బ తగిలింది.సినిమా షూటింగ్ లు, రిలీజ్ లు లేకపోవడంతో వేల కోట్ల రూపాయిలు నష్టాలు వచ్చాయి.

ఓ విధంగా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని సినిమా ఇండస్ట్రీ చూడాల్సి వచ్చింది.అయితే ఈ సారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా అంతకు మించి ఎఫెక్ట్ ని బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎదుర్కోబోతుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఏకంగా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గా బాలీవుడ్ ఈ ఏడాది 4000 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు.

థియేటర్స్ మూసివేయడంతో చాలా సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి.

అలాగే మినిమమ్ నుంచి బారీ బడ్జెట్ చిత్రాల షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి.ఈ ఎఫెక్ట్ ఇలాగే కొనసాగితే బడ్జెట్ పరిమితులు విపరీతంగా పెరిగిపోతాయి.

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సినిమాల ద్వారా వచ్చే ఆదాయానికి పూర్తిగా గండి పడినట్లే అని ట్రేడ్ మ్యాగజైన్ ఎడిటర్ అతుల్ మోహన్ అంటున్నారు.అలాగే థియేటర్స్ లో సినిమాలు చూడటంపై విపరీతమైన ఆంక్షలు విధించడంతో ఒక వేల హాల్స్ ఓపెన్ అయ్యి సినిమాలు రిలీజ్ అయినా నష్టాలు అయితే తప్పవని అంటున్నారు.

అలాగే కరోనాకి భయపడి థియేటర్స్ కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుందని దీని వలన మరింతగా నష్టాలు పెరుగుతాయని భావిస్తున్నారు.ఏ విధంగా చూసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీ దెబ్బ తగిలే అవకాశం అయితే ఉందని సినిమా పండితుల మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube