ఛాన్స్ ఇవ్వమని అడిగితే రాత్రికి వస్తావా... అంటూ ఆ డైరెక్టర్ దారుణంగా....

సినిమా పరిశ్రమ ఏదైనా సరే క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ గా ఉంటుంది.అయితే అప్పట్లో కొందరు సినీ నటులు ఈ కాస్టింగ్ కౌచ్ సమస్య బారిన పడి తమ సినీ జీవితాలనే నాశనం చేసుకున్నారు.

 Bollywood Serial Actress Donal Bisht React About Casting Couch Incidents, Bollyw-TeluguStop.com

కానీ ఇప్పుడు ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యపై ఉద్యమించేందుకు గాను మీటూ ఉద్యమం గురించి అందరికీ అవగాహన ఉండటంతో ప్రతి ఒక్కరు నిర్భయంగా తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి బయటకు వచ్చి స్పందిస్తున్నారు.కాగా బాలీవుడ్లో పలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ డోనాల్ బిష్టి ఇటీవలే తాను ఎదుర్కున్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య పై స్పందించింది.

ఇందులో భాగంగా తాను కూడా అందరి నటీనటులలాగే సినిమా పరిశ్రమకు ఎన్నోకలలతో, ఆశలతో నటి అవుదామని వచ్చానని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తాను ఊహించిన దానికి మరియు రియాలిటీకి చాలా తేడా ఉందని గమనించానని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడుని సినిమా అవకాశం విషయమై కలిసేందుకు వెళ్లగా అతడు తనకి సినిమా అవకాశం కచ్చితంగా ఇస్తానని కానీ అందుకు బదులుగా ఒక రాత్రి మొత్తం తనతో గడిపి తన లైంగిక వాంఛను తీర్చమని అడిగాడట.

Telugu Bollywoodserial, Donal Bisht, Laalishq-Movie

దీంతో విషయం అర్థం చేసుకున్నటువంటి డోనాల్ బిష్టి అక్కడ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నానని తెలిపింది.అయితే తనను లైంగికంగా వేధించిన ఆ దర్శకుడి పేరు చెప్పడానికి మాత్రం డోనాల్ బిష్టి  ఇష్ట పడలేదు.అంతేగాక తాను ఎప్పుడూ కూడా అవకాశాల కోసం అడ్డదారులలో ప్రయత్నించలేదని అందువల్లే తాను చాలా తక్కువ ధారావాహికలలో కనిపించానని కూడా తెలిపింది.ఒకవేళ తాను కూడా కమిట్ మెంట్ లు ఇచ్చి ఉంటే ఈ పాటికి బాలీవుడ్లో హీరోయిన్ గా కొనసాగే దానినని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఈ విషయం ఇలా ఉండగా హిందీలో డోనాల్ బిష్టి ఎనిమిదికి పైగా ధారావాహికలలో నటించింది.కాగా ప్రస్తుతం ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ అయినటువంటి స్టార్ ప్లస్ ఛానల్ లో ప్రసారమవుతున్న “దిల్ తో హ్యాపీ హై జి” అనే ధారావాహికలో నటిస్తోంది.

కాగా ఇటీవలే వెబ్ సిరీస్ లో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube