ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్లు.. ప్రస్తుతం కనీసం అవకాశాలు రావట్లేదు..

సినిమా ప్రపంచంలో హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ టైం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.హీరోయిన్ల వయసు 40 వచ్చిందంటే ఫిల్మ్ మేకర్స్ వారి జోలికి పోవడం లేదు.

 Bollywood Senior Heroines Latest Position Details, Bollywood Senior Heroines, Mo-TeluguStop.com

ఎక్కడైనా హీరోయిన్లకు చాలా తక్కువ కెరీర్ ఉంటుందని చెప్పుకోవచ్చు.అంతేకాదు.హిట్, ప్లాఫ్ మీద ఆధారపడే కొంతకాలం నటీమణులు సినిమా పరిశ్రమలో కొనసాగే అవకాశం ఉంది.35 ఏండ్లు దాటితే ఆటో మేటిక్ గా అందాల తారల అవకాశాలు తగ్గిపోతాయి.అయితే కొంత మంది మాత్రమే 40 ఏండ్లు దాటినా ఇండస్ట్రీలో కొనసాగుతారు.దీపికా పదుకొనేకి 35 ఏళ్లు.కత్రినా కైఫ్ కు 37 ఏళ్లు.కరీనా కపూర్ కు 40 ఏండ్లు క్రాస్ చేసినా ప్రస్తుతం వాళ్లు హాట్ బ్యూటీస్ గానే కొనసాగుతున్నారు.

వాస్తవానికి మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, కాజోల్, రవీనా టండన్, జూహీ చావ్లా, శిల్పాశెట్టి, ఐశ్యర్యారాయ్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్లు.ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న హీరోలంతా నైంటీస్ లో వీరితో జతకట్టిన వారే.

ఈ ముద్దుగుమ్మలంతా అప్పట్లో మంచి స్టార్ డమ్​ చూసిన వారే.అయినా ప్రస్తుతం వీరిని పట్టించుకోవడం లేదు ఫిల్మ్ మేకర్స్.

ప్రస్తుతం ఈ హీరోయిన్స్ లో చాలా మంది బుల్లితెర మీదే సందడి చేస్తున్నారు.రియాలిటీ షోలలో మాధురీ, శిల్పాశెట్టి, రవీనా టండన్ కనిపిస్తున్నారు.

రాణీ ముఖర్జీ, సుస్మితా సేన్, అటు అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు.

Telugu Aishwarya Rai, Bollywood, Juhi Chawla, Kajal, Madhuri Dixit, Offers, Shri

తెలుగులో రమ్య కృష్ణ, మీనా లాంటి వాళ్లు సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారు తప్ప.మిగతా వాళ్లు ఎప్పుడో ఏజ్ బార్ క్యారెక్టర్లకు పరిమితం అయ్యారు.త్రిషా, కాజల్, శ్రేయ, తమన్నా లాంటి వాళ్ల కెరీర్ కూడా నెమ్మదిగా నేలబాట పడుతోంది.

వాస్తవానికి హీరోలకు పరిమితులుండవ్.పెళ్లై పిల్లలున్నా.

వారి పెళ్లిలవుతున్నా.వాళ్లకి పిల్లలొస్తున్నా హీరోలుగానే కొనసాగుతున్నారు.

హీరోయిన్లు విషయంలో ఆ సూత్రం వర్తించడం లేదు.పెళ్లయి.

పిల్లలు ఉన్నారంటే వారిని పట్టించుకోవడమే మానేస్తున్నారు సినిమా దర్శక నిర్మాతలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube