సినిమా ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదంటూ ఫైర్ అయిన స్టార్ హీరోయిన్ ....  

తెలుగులో రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “ఏక్ నిరంజన్” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే తన నటనా ప్రతిభతో ప్రేక్షకులని ఆకట్టుకున్నప్పటికీ ఏక్ నిరంజన్ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది.

TeluguStop.com - Bollywood Queen Kangana Ranaut Sensational Comments On Nepotism In Film Industry

 కానీ ఏఈ అమ్మడికి మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి విమర్శలే అందుకుంది.అయితే ఈ మధ్య కాలంలో కంగనా రనౌత్ నేపోటిజం పై కామెంట్లు చేస్తూ తరచూవార్తల్లో నిలుస్తోంది.

అయితే తాజాగా మరోమారు బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.సినిమా పరిశ్రమ ఎవడబ్బ సొత్తు కాదని టాలెంట్ ఉన్న వారిని కచ్చితంగా ఇండస్ట్రీ గుర్తిస్తుందని చెప్పుకొచ్చింది.

TeluguStop.com - సినిమా ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదంటూ ఫైర్ అయిన స్టార్ హీరోయిన్ ….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాక ప్రముఖ తమిళ సినిమా అయినటువంటి జల్లికట్టు ఆస్కార్ నామినేషన్ కి సెలెక్ట్ అవడంతో కంగనా రనౌత్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది.

దీన్ని బట్టి చూస్తే భారీ బడ్జెట్, గొప్ప నిర్మాతలు, దర్శకులు తీసినంత మాత్రాన సినిమాలు హిట్ కావని, అలాగే అవార్డులు కూడా వరించవని “జల్లికట్టు” చిత్రం మరోసారి నిరూపించిందని చెప్పుకొచ్చింది.

 దీంతో కంగనా రనౌత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో దుమారం రేపుతున్నాయి.అంతేగాక బాలీవుడ్ సినిమా పరిశ్రమలో నూతన నటీనటులకు చాన్సులు రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కంగనా రనౌత్ హిందీలో ఇటీవలే “పంగా” అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లను మాత్రం రాబట్టలేక పోయింది. దీంతో కంగనా రనౌత్ తన తదుపరి చిత్రం విషయాలలో కొంతమేర ఆచి తూచి అడుగులు వేస్తోంది. కాగా ప్రస్తుతం తమిళంలో “తలైవి” అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.

 ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషల్లో తెరకెక్కుతోంది.

#NepotismIn #Kangana Ranaut #BollywoodQueen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు