ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా బడా నిర్మాత.. ఎవరంటే ?

బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ షో కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

 Bollywood Producer Karan Johar Will Host Bigg Boss New Version-TeluguStop.com

ఈ షో ఇండియాలో ప్రముఖ భాషల్లో ఎన్నో సీజన్స్ కంప్లీట్ చేసుకుంది.అన్ని చోట్ల ఎన్నో సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో మన తెలుగులో కూడా ప్రసారమయ్యి చాలా పాపులర్ అయ్యింది.

ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయ్యినప్పటికీ ఈ షో మీద అంచనాలు లేవు.

 Bollywood Producer Karan Johar Will Host Bigg Boss New Version-ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా బడా నిర్మాత.. ఎవరంటే -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ స్టార్ట్ అయ్యాక వన్ వీక్ తర్వాత ఈ షో ఒక రేంజ్ లో పాపులర్ అయ్యింది.

ఈ షో మన దగ్గర సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ అనే చెప్పాలి.ఎందుకంటే మొదటి సీజన్ హోస్ట్ గా ఎన్టీఆర్ చేయడం వల్ల ఈ షో మరింత పాపులర్ అయ్యింది.

మన దగ్గర ఇప్పటికే నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదవ సీజన్ కూడా స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది.

అయితే మన కన్నా ముందు బిగ్ బాస్ షో హిందీలో స్టార్ట్ అయ్యింది.

ఇప్పటికే 14 సీజన్స్ పూర్తి చేసుకుని మరొక సీజన్ కోసం రెడీ అవుతుంది.అన్ని సీజన్స్ లో కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించాడు.

అయితే అన్ని సీజన్స్ తర్వాత ఇప్పుడు హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం కొత్త హోస్ట్ రాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అతను ఎవరో కాదు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్.ఇతడే హిందీ బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో హోస్ట్ గా చేయనున్నాడని టాక్.ఈ సీజన్ అన్ని ఎపిసోడ్స్ ఓటిటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి.

ఈ సీజన్ ఆగస్టు 8 న స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉందని తెలుస్తుంది.మరి ఈసారి హోస్ట్ ప్లేస్ లో బడా నిర్మాత కరణ్ జోహార్ కనిపించి ప్రేక్షకులను ఎంత మేరకు అలరిస్తాడో చూడాలి.

#Bigg Boss #Karan Johar #BollywoodKaran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు