కరోనా కాటుకి బలైపోయిన మరో బాలీవుడ్ నిర్మాత  

Bollywood Producer Anil Suri Died With Corona - Telugu, Corona Effect, Covid-19, Indian Cinema, Tollywood

బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై కరోనా విపరీతంగా ప్రభావం చూపిస్తుంది.కరోనా బారిన పడి హిందీ చిత్రపరిశ్రమకి చెందిన పలువురు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు.

 Bollywood Producer Anil Suri Died With Corona

ఇప్పటికే ఒక సంగీత దర్శకుడు, ప్రముఖ దర్శకుడు బాలీవుడ్ లో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.అలాగే నటులు, నిర్మాతలు కూడా ఈ కరోనా కాటుకి గురయ్యారు.

తాజాగా కరోనా కారణంగా మరో బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మృత్యువాత పడ్డారు.బాలీవుడ్ నిర్మాత, దర్శకుడైన అనీల్ సూరి కరోనాతో క‌న్నుమూశారు.

కరోనా కాటుకి బలైపోయిన మరో బాలీవుడ్ నిర్మాత-General-Telugu-Telugu Tollywood Photo Image

అతని సోదరుడు నిర్మాత రాజీవ్ సూరీ మాట్లాడుతూ అనీల్ జూన్ 2 నుండి హై ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు.త‌ర్వాతి రోజు నుండే అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి పూర్తిగా క్షీణించింది.

వెంట‌నే లీలావ‌తి, హిందూజా ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా వారు అడ్మిట్ చేసుకునేందుకు నిరాక‌రించారని చెప్పారు.

ఓ మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో అనీల్ చికిత్స పొందుతూ అనిల్ సూరి క‌న్నుమూశారు.

శుక్ర‌వారం ఉద‌యం కేవ‌లం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో అనీల్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.అనీల్ రాజ్‌కుమార్‌, రేఖ కాంబినేషన్‌లో కర్మయోగి, రాజ్‌ తిలక్‌ వంటి చిత్రాలు నిర్మించారు.

నా అభిమాన దర్శకుడు, మా సోదరుడు ఒకే రోజు కన్నుమూయడం నిజంగా దురదృష్టకరం’ అని పేర్కొన్నారు రాజీవ్‌ సూరి.ఇప్పటి వరకు బాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు కరోనా కారణంగా ఓ ఆరుమంది వరకు చనిపోయినట్లు తెలుస్తుంది.

మరి ఇది ఇంకా ఎంత మంది ప్రాణాలు బలితీసుకుంటుందో అని ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అందరూ భయపడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test